Lava Yuva 5G Price: అబ్బా ఏమి ఆఫర్‌ గురూ.. రూ.7999కే దిమ్మతిరే ఫీచర్స్‌ 5G ఫోన్‌..

Lava Yuva 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్‌ రూ. 10 వేల కంటే తక్కువ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 17, 2024, 12:06 PM IST
Lava Yuva 5G Price: అబ్బా ఏమి ఆఫర్‌ గురూ.. రూ.7999కే దిమ్మతిరే ఫీచర్స్‌ 5G ఫోన్‌..

Lava Yuva 5G Price Cut: రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే 5G ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో లభిస్తున్న 5G స్మార్ట్‌ఫోన్స్‌లలో అత్యంత చౌక మొబైల్‌..ఈ మొబైల్ బ్యాక్‌ సెటప్‌లో 50MP ప్రధాన వెనుక కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇవేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

ధర, ఫీచర్స్‌ వివరాలు:
ప్రస్తుతం భారతదేశంలో Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ ప్రారంభ ధర రూ.9,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వేరియంట్స్‌ వివరాల్లోకి వెళితే, దీని మొదటి వేరియంట్‌ 4GB ర్యామ్‌, 64GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 9,499 కాగా, రెండవ వేరియంట్‌ 128GB స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ. 9,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో OneCard క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించేవారికి దాదాపు రూ. 500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు  IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి EMI ఆప్షన్‌ను చూస్ చేసుకుని వారికి అదనంగా రూ.250 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లపై కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ఇక ఈ 64GB వేరియంట్‌ అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ. 8,999 లోపే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి రూ.1500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7999కే పొందవచ్చు. 

Lava Yuva 5G ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.3-అంగుళాల IPS LCD డిస్‌ప్లే
HD ప్లస్ రిజల్యూషన్ 
90Hz రిఫ్రెష్ రేట్‌
Unisock T750 ప్రాసెసర్‌
Android 13
128GB స్టోరేజ్ వేరియంట్‌
మైక్రో SD కార్డ్‌ స్టోరేజీ ఆప్షన్‌
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
8 మెగాపిక్సెల్ కెమెరా
18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5000 mAh బ్యాటరీ
USB టైప్-C పోర్ట్‌
5G, 4G LTE 
డ్యూయల్-బ్యాండ్ Wi-Fi
బ్లూటూత్ 5.0, GPS

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News