NTR - Hrithik - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్‌ల వార్ 2 మూవీలో క్రేజీ యంగ్ సౌత్ హీరో..

NTR - Hrithik - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తోన్న 'వార్ 2' మూవీపై దేశ వ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. సౌత్, నార్త్ వంటి బిగ్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ మూవీలో మరో సౌత్ యంగ్ క్రేజీ హీరో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : May 27, 2024, 12:49 PM IST
NTR - Hrithik - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్‌ల వార్ 2 మూవీలో క్రేజీ యంగ్ సౌత్ హీరో..

NTR - Hrithik - War 2: ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది. దీంతో ఎన్టీఆర్‌తో సినిమాలు నిర్మించాడానికి పలు భాషలకు చెందిన నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ కోవలో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్‌ వంటి దక్షిణాది, ఉత్తరాది సూపర్ స్టార్స్‌తో కలయికతో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'వార్ 2' మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తారక్, హృతిక్‌లపై ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట తరహాలో ఇందులో ఓ సూపర్ సాంగ్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చే
చేసింది. ఇద్దరు మంచి డాన్సర్స్ కావడంతో ఈ పాట ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మరో యంగ్ సౌత్ హీరో కూడా నటిస్తున్నాడట.

కన్నడలో వరుస యాక్షన్ సినిమాలతో అలరిస్తున్న ధృవ సర్జ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా మరో పవర్ఫుల్ రోల్ అనగానే ధృవ సర్జ కూడా రెండో థాట్ లేకుండా ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ మూవీలో జగపతిబాబు, శరత్ కుమార్ వంటి సౌత్ నటులు కూడా ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ విషయానికొస్తే.. కొరటాల శివతో 'దేవర పార్ట్ -1' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల చేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమా ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో 1945 నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also read: Remal Cyclone Alert: ఇవాళ తీరం దాటనున్న రెమల్ తుపాను, ఏపీలో రెండ్రోజులు వర్షసూచన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News