ఎన్.టి.ఆర్ మేకప్ వేస్తే ఓ హీరో... మరి మేకప్ తీస్తే.. ?

ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా మొదటి భాగం కథా నాయకుడు సినిమాకు ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ రాకా ఆ సినిమాకు మరింత బూస్టింగ్‌నిస్తూ తాజాగా పలు సూపర్ హిట్ ప్రోమోలను విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాతలు.

Last Updated : Jan 13, 2019, 02:52 PM IST
ఎన్.టి.ఆర్ మేకప్ వేస్తే ఓ హీరో... మరి మేకప్ తీస్తే.. ?

ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా మొదటి భాగం కథా నాయకుడు సినిమాకు ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ రాకా ఆ సినిమాకు మరింత బూస్టింగ్‌నిస్తూ తాజాగా పలు సూపర్ హిట్ ప్రోమోలను విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాతలు. ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ప్రముఖ సీనియరు హీరో భానుచందర్.. ఎన్.టి.ఆర్ గొప్పతనం గురించి చెబుతూ.. ''ఎన్.టి.ఆర్ మేకప్ వేస్తే ఓ హీరో... ఆయన మేకప్ తీస్తే మోర్ దేన్ ఏ హీరో'' అని చెప్పిన డైలాగ్ ప్రోమో నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి, కళ్యాణ్ రామ్, నిత్యామీనన్.. ఇలా ఎందరో సినీ ప్రముఖులు వివిధ ముఖ్యపాత్రల్లో నటించారు. జాగర్లమూడి క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం మహా నాయకుడు ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది.

 

Trending News