NTR - Prashanth Neeel: ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్యాన్ ఇండియా హీరోయిన్.. ?

NTR - Prashanth Neeel - Rashmika: ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక నటించబోతుందా అంటే ఔననే అంటున్నారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : May 24, 2024, 11:25 AM IST
NTR - Prashanth Neeel: ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్యాన్ ఇండియా హీరోయిన్.. ?

NTR - Prashanth Neeel - Rashmika: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి ఎపుడెపుడు వెళుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అ యేడాది అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఎన్టీఆర్ .. ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న సినిమాను ఆగష్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన కూడా ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదల చేసారు. అంతకు ముందు ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి ఈ సినిమా వెళుతుందని ప్రకటించారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. సలార్ 2 మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే సలార్ పార్ట్ 2కు సంబంధించి షూటింగ్ పూర్తి కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రష్మిక మందన్న పుష్ప, యానిమల్ మూవీలతో ప్యాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకుంది. రష్మిక యాక్ట్ చేస్తే ఈ సినిమాకు ప్లస్ అవుతుందనే నమ్మకంతో ఈమెను కథానాయికగా తీసుకున్నట్టు సమాచారం.

మరోవైపు ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ లపై నాటు నాటు తరహాలో ఓ పాటను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇదే హైలెట్ అని చెబుతున్నారు. ఎన్టీఆర్, హృతిక్ మంచి డాన్సర్స్ కావడంతో ఈ పాటపై అభిమానులు చాలానే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. జూన్ నెలాఖరు వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ పార్ట్ పూర్తి కానుంది. ఈ సినిమా వచ్చే యేడాది రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

Also Read: Mohanlal: క్రేజీ బ్లాక్ బస్టర్‌ సీక్వెల్‌లో జాతీయ ఉత్తమ నటుడు మోహన్‌లాల్.. ఫస్ట్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News