Hari Hara Veera Mallu Teaser Talk: పవన్ కళ్యాణ్‌ 'హరిహర వీరమల్లు' టీజర్ టాక్ రివ్యూ.. ధర్మం కోసం యుద్ధం చేసే వీరమల్లు..

Pawan Kalyan - Hari Hara Veera Mallu Teaser Talk Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓ వైపు ఎన్నికల హడావుడి ఉన్నారు. మరోవైపు ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా ఒదులుతున్నారు మేకర్స్. తాజాగా ఈయన హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 2, 2024, 09:21 AM IST
Hari Hara Veera Mallu Teaser Talk: పవన్ కళ్యాణ్‌ 'హరిహర వీరమల్లు' టీజర్ టాక్ రివ్యూ.. ధర్మం కోసం యుద్ధం చేసే వీరమల్లు..

Pawan Kalyan - Hari Hara Veera Mallu Teaser Talk Review : పవన్ కళ్యాణ్‌ కేవలం నటుడిగానే కాదు.. హీరోగా రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్‌ తిరిగి షూటింగ్స్‌లో జాయిన్ కానున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటిస్తోన్న పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ 'హరి హర వీరమల్లు' సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసారు. ధర్మం కోసం యుద్ధం చేసిన హరి హర వీరమల్లుడి వీరోచిత పోరాటగాథను ఈ టీజర్‌లో చూపించాడు దర్శకుడు క్రిష్‌. మన ప్రాణాలకు విలువే లేదా అంటూ ఓ చిన్నారి ఆక్రందనలు.. తెలంగాణ ప్రాంత ప్రజలను దోచుకునే నిజాం నవాబు.. ఆయనపై ఢిల్లీ బాద్ షా ఔరంగజేబును గడగడలాడించిన ఓ అజ్ఞాతయోధుడి కథగా 'హరి హర వీరమల్లు' సినిమా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి. అంటే పెద్దలను దోచుకొని పేదలకు పెట్టే రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్‌ కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేవోల్ నటించాడు. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్టు టీజర్‌లో చూపించారు.

'హరి హర వీరమల్లు' ఫస్ట్ పార్ట్ 'స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' గా పెట్టారు. మొత్తంగా లెంగ్త్ ఎక్కువ కావడంతో రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతుంది. పవన్ కెరీర్‌లో రెండు పార్టులగా రాబోతున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ వీరోచిత కత్తి ఫైటింగ్ హైలెట్‌గా నిలవడం ఖాయం. అంతేకాదు 2024లో రిలీజ్ చేయబోతున్నట్టు టీజర్‌లో చూపించారు. మొత్తంగా ఐదు భాషల్లో ఈ టీజర్‌ను రిలీజ్ మొత్తంగా ఈ టీజర్‌తో ఈ సినిమాపై అంచాలు పెంచేశాడు దర్శకుడు. బహుశా పవన్ కళ్యాణ్‌ కెరీర్‌లో ఎక్కువ రోజులు షూటింగ్ జరుకుపుకున్న చిత్రంగా 'హరి హరవీరమల్లు' సినిమా నిలిచింది. పవన్ కళ్యాణ్‌ తొలిసారి తన కెరీర్‌లో ఓ చారిత్రక నేపథ్యమున్న సినిమా చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. హరి హరవీరమల్లు సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. పవన్ కళ్యాణ్‌ కెరీర్‌లో ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 60 కోట్ల రికార్డు రేటుకు కొనుగోలు చేసింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు అన్ని భాషలకు కలిపి రూ. 35 కోట్లకు అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ కలిపి దాదాపు రూ. 110 కోట్ల టేబుల్ ప్రాఫిట్ విడుదలకు ముందే నిర్మాతకు వస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్.. సుజిత్ డైరెక్షన్‌లో 'ఓజీ' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కూడా పీరియాడిక్ మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఈ ఇయర్ సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ తారీఖులో విడుదల చేయడం అనేది డౌటే అని సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్‌ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.  ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేవోల్ నటించాడు. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నట్టు టీజర్‌లో చూపించారు. 'హరి హర వీరమల్లు' ఫస్ట్ పార్ట్ 'స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' గా పెట్టారు. మొత్తంగా లెంగ్త్ ఎక్కువ కావడంతో రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతుంది. పవన్ కెరీర్‌లో రెండు పార్టులగా రాబోతున్న తొలి సినిమా ఇదే.  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ వీరోచిత కత్తి ఫైటింగ్ హైలెట్‌గా నిలవడం ఖాయం. అంతేకాదు 2024లో రిలీజ్ చేయబోతున్నట్టు టీజర్‌లో చూపించారు.  

మొత్తంగా ఈ టీజర్‌తో ఈ సినిమాపై అంచాలు పెంచేశాడు దర్శకుడు. బహుశా పవన్ కళ్యాణ్‌ కెరీర్‌లో ఎక్కువ రోజులు షూటింగ్ జరుకుపుకున్న చిత్రంగా 'హరి హరవీరమల్లు' సినిమా నిలిచింది. పవన్ కళ్యాణ్‌ తొలిసారి తన కెరీర్‌లో ఓ చారిత్రక నేపథ్యమున్న సినిమా చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి.

హరి హరవీరమల్లు  సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. పవన్ కళ్యాణ్‌ కెరీర్‌లో ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 60 కోట్ల రికార్డు రేటుకు కొనుగోలు చేసింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు అన్ని భాషలకు కలిపి రూ. 35 కోట్లకు అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్నాయి.  మొత్తంగా డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ కలిపి దాదాపు రూ. 110 కోట్ల టేబుల్ ప్రాఫిట్ విడుదలకు ముందే నిర్మాతకు వస్తున్నాయి.

మరోవైపు పవన్ కళ్యాణ్.. సుజిత్ డైరెక్షన్‌లో  'ఓజీ' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కూడా పీరియాడిక్ మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఈ ఇయర్ సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ తారీఖులో విడుదల చేయడం అనేది డౌటే అని సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్‌ శంకర్ దర్శకత్వంలో  'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై  భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

Also read: KCR Ban: కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ఝలక్‌.. 48 గంటల పాటు ప్రచారం నిషేధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News