ఐఈబిఎఫ్ అవార్డు అందుకున్న పవన్

పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకమైన ఇండో- యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నాడు. ఐఈబిఎఫ్ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు అవార్డు కమిటీకి కృతజ్ఞతలు చెప్పాడు.

Updated: Nov 18, 2017, 05:06 PM IST
ఐఈబిఎఫ్ అవార్డు అందుకున్న పవన్

పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకమైన ఇండో- యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నాడు. ఐఈబిఎఫ్ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు అవార్డు కమిటీకి కృతజ్ఞతలు చెప్పాడు పవన్. బల్గేరియా నుండి ప్రత్యేకంగా ఆయన ఈ అవార్డు అందుకోవడం కోసం లండన్ వెళ్లారు. అభిమానులు, తెలుగు ప్రజలు, జనసేన కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అవార్డు ప్రదానోత్సవ కార్యాక్రమంలో బ్రిటన్ కు చెందిన తెలుగువారు హాజరయ్యారు. పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ డా.బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ ను సందర్శించారు.

పవన్ కళ్యాణ్ బల్గేరియాలో అజ్ఞాతవాసి షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే...! అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్యాకప్ చెప్పేసిన తరువాత ఆయన మూడు రోజుల పర్యటన నిమిత్తం లండన్ కు వెళ్లారు. అందులో భాగంగానే గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. చివరి రోజు మెడికల్ కాలేజీలో విద్యార్థులతో ముచ్చటిస్తారు.

లండన్ నుంచి తిరిగివచ్చిన వెంటనే తిరిగి అజ్ఞాతవాసి షూటింగ్ లో బిజీ కానున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేస్తున్నారు.