Allu Arjun: బన్నీని కలిసే ఉద్యేశం పవన్ కి లేదా.. అందుకే ఇలా చేస్తున్నారా..?

Pawan Kalyan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2.. సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా డిసెంబర్ ఐదవ తేదీన విడుదలైన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే 1000 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ సినిమాల వల్ల అల్లు అర్జున్కి కొన్ని కష్టాలు మాత్రం తప్పలేదు. ఆఖరికి జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో అతన్ని సెలబ్రిటీస్ అందరూ వెళ్లి కలుస్తుండగా.. పవన్ కళ్యాణ్ మౌనం మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 15, 2024, 01:56 PM IST
Allu Arjun: బన్నీని కలిసే ఉద్యేశం పవన్ కి లేదా.. అందుకే ఇలా చేస్తున్నారా..?

Allu Arjun vs Pawan Kalyan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరో  అయిపోయారు. అల్లు అర్జున్,  సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప.. 2021 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ సినిమా సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన అల్లు అర్జున్ తన ఖాతాలో..అరుదైన రికార్డు క్రియేట్ చేసుకున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా డిసెంబర్ 4వ తేదీన పుష్ప -2  సినిమా బెనిఫిట్ షో వేయగా హైదరాబాదులోని సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ర్యాలీతో వచ్చారు. ఈ సందర్భంగా బన్నీపై కేసు నమోదు అవ్వగా డిసెంబర్ 13వ తేదీన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్ట్ లో విచారణకు రాగా 14 రోజుల రిమాండ్ విధించారు. 

అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా.. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. కానీ చంచల్గూడా పోలీసులు మాత్రం ఆయనను  ఒకరోజు రాత్రంతా జైల్లోనే ఉంచారు. ఇక నిన్న ఉదయం బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్ ను కలవడానికి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలింది. 

ముఖ్యంగా హీరోయిన్లు ఒక్కరు కూడా రాలేదు.  కానీ హీరోలంతా వచ్చారు. అలాగే మొన్న  చిరంజీవి తన సినిమా షూటింగ్ను కూడా క్యాన్సిల్ చేసుకుని సురేఖతో  అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. నిన్న సురేఖ కూడా అల్లు అర్జున్ ఇంటికి మళ్ళీ వచ్చి అల్లుడిని ఆప్యాయంగా పలకరించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈరోజు అల్లు అర్జున్ ని కలవడానికి వస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇవన్నీ కేవలం రూమర్సే అనే తెగస్తోంది.

నిన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి వచ్చారు. కానీ అల్లు అర్జున్ ని కలవకుండా మళ్ళీ ఈరోజు ఉదయం.. విజయవాడ వెళ్ళిపోయారు. ఈరోజు అల్లు అర్జున్ చిరంజీవి ఇంట్లో లంచ్ కి వెళ్తున్నారు. కాగా ఈ లంచ్ కూడా పవన్ కళ్యాణ్ అటెండ్ కాకపోవటం.. మరిన్ని చర్చలకు దారితీస్తోంది. ఇక దీన్ని బట్టి చూస్తే బన్నీని కలవడానికి పవన్ కళ్యాణ్.. ఇష్టం చూపించడం లేదని, కారణం ఎన్నికల సమయంలో బన్నీ వైసీపీ అభ్యర్థికి సపోర్టు చేయడమే అని సమాచారం.

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News