Prabhas: ప్రభాస్ పెద్ద మనసు.. వయనాడ్ వరద బాధితులకు బాహుబలి భారీ విరాళం..

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ పెద్ద మనసు చాటుకున్నాడు. వరదలతో అతలాకుతలమైన కేరళలోని రాష్ట్రంలోని వయనాడ్ లోని జరిగిన ప్రకృతి బీభత్సానికి ఎంతో మంది ప్రజలు విగత జీవులయ్యారు. ఇప్పటికే పలువురు సినీ నటులు వయనాడ్ బాధితులకు తమ వంతు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్  ప్రభాస్.. కేరళ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 7, 2024, 12:35 PM IST
Prabhas: ప్రభాస్ పెద్ద మనసు.. వయనాడ్ వరద బాధితులకు బాహుబలి భారీ విరాళం..

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తాజాగా కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో జరిగిన ప్రకృతి విలయానికి అక్కడ ప్రజలు విగత జీవులయ్యారు. చాలా మంది పుట్టకొకరు చెట్టుకొరకు అన్నట్టుగా తయారయ్యారు. ఇప్పటికే తమిళ హీరోలు సూర్య, కార్తితో పాటు తెలుగు హీరోలైన చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలు కేరళ వరద బాధితుల సహాయార్ధం తమ వంతు విరాళం ప్రకటించారు. చిరంజీవి, రామ్ చరణ్ కలిపి దాదాపు రూ. కోటి విరాళం ప్రకటించారు. అటు అల్లు అర్జున్.. రూ. 25 లక్షల విరాళాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. రష్మిక రూ. 10 లక్షలు.. సూర్య, కార్తిలు కలిపి రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.  

తాజాగా రెబల్ ప్రభాస్ కూడా వయనాడ్ వరద బాధితుల సహాయార్ధం రూ. 2 కోట్లను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసి తన మంచి మనసు చాటుకున్నారు. ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చూపెడున్న ప్రభాస్.. తన రేంజ్ కు తగ్గట్టు విరాళం ప్రకటించారని అభిమానులు చెప్పుకుంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతున్నాడు. వరుసగా ప్యాన్ ఇండియా నేపథ్యంలోని స్టోరీలనే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అంతేకాదు ప్రభాస్.. కరోనా సహా పలు సందర్బాల్లో  తన వంతుగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కేరళలోని వయనాడ్ వరద బాధితులకు తన వంతుగా భారీ ఆర్ధిక సహాయం అందించారు.

ప్రభాస్  సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కల్కి మూవీతో పలకరించాడు. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ ను నమోదు చేసింది. అంతేకాదు మన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 1150 కోట్లకు పైగా గ్రాస్ వసూల్లతో దూసుకుపోతుంది. మన దేశంలో నాల్కో అతిపెద్ద గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కన్నప్పలో ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ వచ్చే యేడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. ఇంకోవైపు సలార్ పార్ట్ 2 షూటింగ్ జరగుతోంది. ఇంకోవైపు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్..హను రాఘవపూడి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ యుద్ద నేపథ్య సినిమా ‘ఫౌజీ’ సినిమాలను లైన్ లో పెట్టాడు.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News