Mahesh SVSC: మహేష్ సీతమ్మవాకిట్లో చేయడానికి ప్రభాస్ కారణమట.. ఎలాగో తెలుసా?

Mahesh in Seethamma Vakitlo Sirimalle Chettu: వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ ఆ పాత్రలో నటించడానికి కారణం ప్రభాస్ అట. ఆ వివరాలు తెలుసా?

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 7, 2023, 09:33 PM IST
Mahesh SVSC: మహేష్ సీతమ్మవాకిట్లో చేయడానికి ప్రభాస్ కారణమట.. ఎలాగో తెలుసా?

Prabhas is Reason for Mahesh Doing Seethamma Vakitlo Sirimalle Chettu: వెంకటేష్,మహేష్ బాబు హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రం విడుదల అయి దాదాపు పదిహేనేళ్లు పూర్తవుతున్నా ఈ సినిమా క్రేజ్ అంతా కాదు. అప్పట్లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్ అందుకోవడమే కాక కుటుంబాల అందరిని థియేటర్లకు కూడా రప్పించింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన అంజలి నటించగా మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్గా నటించింది.

అయితే ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ ఎలా సెట్ అయిందని విషయం చాలామందికి తెలియదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అప్పటి సంగతులు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు పంచుకున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎవరితో చేయాలనే విషయం మీద ముందు క్లారిటీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. అప్పటికే కొత్త బంగారులోకం సినిమాతో హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల ఈ కథ లైన్ రాసుకుని తన దగ్గరకు వచ్చి ఎవరైనా అప్ కమింగ్ హీరోలతో ఈ సినిమా చేద్దామని అంటే అప్ కమింగ్ హీరోలతో కాదు ఎస్టాబ్లిష్ అయిన టాప్ హీరోలతో చేస్తే సినిమా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పానని అన్నారు.

Also Read: Ravanasura OTT Release: రావణాసుర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

అయితే అప్పటికే ఆయన విక్టరీ వెంకటేష్ తో ట్రావెల్ చేస్తున్న క్రమంలో ఆయన కథ చెబితే చేయడానికి సిద్ధమని అన్నారని మరో హీరో కోసం వెతుకుతున్న సమయంలో ఆశ్చర్యకరంగా మహేష్ బాబు స్వయంగా తనకు మెసేజ్ చేశారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. మహేష్ బాబు తాను చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసి ఎంజాయ్ సినిమా బాగుందని ఒక మాస్ హీరోతో ఇలాంటి క్లాస్ సబ్జెక్ట్ చేయడం తనకు నచ్చిందని చెబుతూ మెసేజ్ చేశారని ఆ మెసేజ్ కి కృతజ్ఞతగా తాను మహేష్ బాబు ఆగడు సెట్ కి వెళ్లానని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

సరదాగా ఒప్పుకుంటారో ఒప్పుకోరు అనే ఉద్దేశంతో ఇలా ఒక కథ అనుకున్నామని, చెబితే కథ చెప్పమన్నారని విన్న వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారని ఆయన అన్నారు. అలా ఈ సినిమాను ప్లాన్ చేయడం, షూట్ చేయడం ఆ తర్వాత రిలీజ్ చేయడం అన్నీ కూడా శరవేగంగా జరిగిపోయాయని తన బ్యానర్ లో వచ్చిన ఫీల్ గుడ్ సినిమాస్ లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోయిందని ఈ సందర్భంగా దిల్ రాజు కామెంట్ చేశారు.

Also Read: Allu arjun Top 10 Movies: అల్లు అర్జున్ టాప్ టెన్ మూవీస్ ఇవే.. కల్ట్ స్టేటస్ సాధించిన సినిమా ఏదంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News