Prabhas: త్వరలో ఇటలీకి రాధేశ్యామ్ టీమ్... భారీ షెడ్యూల్ ఫిక్స్

ప్రభాస్( Prabhas ) నటిస్తోన్న తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ మూవీ మేకర్స్ తమ నెక్ట్స్ షెడ్యూల్ ను ఇటలీలో ప్లాన్ చేశారు. 

Last Updated : Sep 24, 2020, 01:29 AM IST
    • ప్రభాస్న నటిస్తోన్న తాజా చిత్రం రాధేశ్యామ్.
    • ఈ మూవీ మేకర్స్ తమ నెక్ట్స్ షెడ్యూల్ ను ఇటలీలో ప్లాన్ చేశారు.
    • దీని కోసం వారి 15 రోజుల ప్రత్యేక షెడ్యూల్ ను ఫిక్స్ చేశారు.
Prabhas: త్వరలో ఇటలీకి రాధేశ్యామ్ టీమ్... భారీ షెడ్యూల్ ఫిక్స్

ప్రభాస్ ( Prabhas ) నటిస్తోన్న తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ మూవీ మేకర్స్ తమ నెక్ట్స్ షెడ్యూల్ ను ఇటలీలో ప్లాన్ చేశారు. దీని కోసం వారి 15 రోజుల ప్రత్యేక షెడ్యూల్ ను ఫిక్స్ చేశారు. అక్టోబర్ లో రాధేశ్యామ్ టీమ్ ఇటలీకి వెళ్లి అక్కడ షూటింగ్ కంటిన్యూ చేయనుంది. ఇంతకు ముందే చిత్రీకరణ టీమ్ విదేశాల్లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. 

 

ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి

రాధేశ్యామ్ ( Radhe Shyam ) మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. పిరియాడికల్ డ్రామా, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో యూరోపియన్ బ్యాక్ గ్రౌండ్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ విదేశాల్లో పూర్తి చేసుకుంది. తాజాగా మూడవ షెడ్యూల్ తో విదేశాల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది అని సమాచారం. 

2020 లో సెట్స్ పైకి వెళ్లిన రాధేశ్యామ్ కొంత కాలం చిత్రీకరణలో ఉంది. అయితే కరోనావైరస్ ( Coronavirus ) వల్ల చిత్రీకరణ నిలిచిపోయింది. దేశంలో లాక్ డౌన్ విధించడానికి ముందే జార్జియాలో చేయాల్సిన షెడ్యూల్ ను విజయవంతంగా ముగించుకుని మార్చిలోనే టీమ్ మొత్తం భారత్ కు తిరిగి వచ్చింది. ఇలా తిరిగి వచ్చిన వెంటనే ప్రభాస్ తన సోషల్ మీడియా ( Social Media ) ఖాతాలో ఇటీవలే విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాను. కొంత కాలం క్వారైంటైన్ లో ఉంటాను అని కూడా తెలిపాడు.

 

ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి

విదేశాల్లో షూటింగ్ కు కావాల్సిన వీసా అనుమతులను ఇప్పటికే మేకర్స్ సంపాదించారని సమాచారం. రాధేశ్యామ్ మూవీతో పాటు ప్రభాస్ మరో రెండు చిత్రాలకు కమిట్ అయ్యాడు. ఇందులో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఒక సినిమా ఉండగా.. టీ సిరిస్ తో ఆదిపురుష్ చిత్రం చేస్తున్నాడు.

 

 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే   ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

 

Trending News