Prabhas: సోషల్ మీడియాలో ప్రభాస్ ప్రభంజనం.. అరుదైన రికార్డు

బాహుబలి ( Baahubali ) చిత్రంతో జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలో సూపర్ స్టార్డమ్ సంపాందించుకున్నాడు ప్రభాస్. 

Last Updated : Sep 26, 2020, 11:57 PM IST
    • బాహుబలి చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ స్టార్డమ్ సంపాందించుకున్నాడు ప్రభాస్.
    • ఎంతగా అంటే జపాన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కలిసి ఫ్యాన్ క్లబ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.
    • బాలీవుడ్ హీరోలకు సమానంగా ప్రభాస్ కు పాపులారిటీ ఉంది.
Prabhas: సోషల్ మీడియాలో ప్రభాస్ ప్రభంజనం.. అరుదైన రికార్డు

బాహుబలి ( Baahubali ) చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ స్టార్డమ్ సంపాందించుకున్నాడు ప్రభాస్. ఎంతగా అంటే జపాన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కలిసి ఫ్యాన్ క్లబ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. బాలీవుడ్ హీరోలకు సమానంగా ప్రభాస్ కు పాపులారిటీ ఉంది. రెమ్యునరేష్ లో కూడా బాహుబలి అనిపించుకున్నాడు. అందుకే ప్రభాస్ తో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ఒక తెలుగు హీరోకు జాతీయ స్థాయిలో ఇంత క్రేజ్ రావడం గ్రేట్. 

ALSO READ| Rice ATM : హైదరాబాద్ లో 12 వేల మంది కడుపు నింపిన రైస్ ఏటీఎం

తాజాగా డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) మరో రికార్డును సాధించాడు. ప్రభాస్ సోషల్ మీడియాలో ( Social Media ) ఎక్కువగా పోస్టులు పెట్టడు. కేవలం చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే షేర్ చేస్తాడు. అంటే తన సినిమా అప్డేట్స్ అలాంటివి అన్నమాట. అయినా కానీ ప్రభాస్ ను మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఫేస్ బుక్ లో ప్రభాస్ పేజికి వచ్చిన లైక్స్ చూస్తే ఔరా అనాల్సిందే. ప్రభాస్ పేజీకి ఏకంగా 20 మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. దీన్ని బట్టి సోషల్ మీడియాలో ప్రభాస్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ALSO READ| Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు.. 

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాధే శ్యామ్ మూవీతో బిజీగా ఉన్నాడు. త్వరలో యూరోప్ లో షూటింగ్ జరగనుంది. అదే సమయంలో టీ సిరీస్ తో ఆదిపురుష్ ( Adipurush ) చిత్రం చేస్తున్నాడు. ఆ తరువాత నాగ్ అశ్విన్ తో ఒక సినిమా చేయనున్నాడు. ప్రభాస్ కు ప్యాన్ ఇండియా పాపులారిటీ ఉంటంతో ఇకపై అన్ని మూవీస్ జాతీయ స్థాయిలో విడుదల కానున్నాయి అని తెలుస్తోంది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News