Rashmi Sudheer Love:యాంకర్ రష్మీ, సుధీర్‌ల పరువుతీసిన పంచ్ ప్రసాద్.. ఆ సర్వీస్‌ చేయమని అడిగేసిన కమెడియన్

Punch Prasad Satires on Anchor Rashmi and Sudheer: పంచ్ ప్రసాద్ వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మీ సుధీర్‌లను పంచ్ ప్రసాద్ ఆడేసుకున్నాడు. చాలా రోజులకు ఇలా బుల్లితెరపై మళ్లీ కలిసి కనిపించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2023, 02:28 PM IST
  • బుల్లితెరపై కలిసి కనిపించిన రష్మీ సుధీర్
  • గాలోడు అంటూ పరువుతీసిన పంచ్ ప్రసాద్
  • రష్మీ డ్రెస్ మీద పంచ్ ప్రసాద్ కౌంటర్లు
Rashmi Sudheer Love:యాంకర్ రష్మీ, సుధీర్‌ల పరువుతీసిన పంచ్ ప్రసాద్.. ఆ సర్వీస్‌ చేయమని అడిగేసిన కమెడియన్

Punch Prasad Satires on Anchor Rashmi and Sudheer: నెట్టింట్లో రష్మీ, సుధీర్‌ల కాంబో మీద వచ్చే మీమ్స్, ట్రోల్స్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అయితే ఈ ఇద్దరూ కూడా తమ మీద వచ్చే రూమర్లను ఖండించేశారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని, తాము తెరపై ఏం చేసినా కూడా అది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకే అని క్లారిటీగా చెప్పారు. సుధీర్ ఇప్పుడు వెండితెరపై హీరోగా ఫిక్స్ అయ్యాడు.

సుధీర్ బుల్లితెరను పూర్తిగా వదిలేశాడు. గాలోడు సినిమా మాస్ కమర్షియల్‌ మూవీగా సక్సెస్ అయింది. మొదటి సారిగా గాలోడు సినిమాతో బ్రేక్ ఈవెన్ కొట్టేసి లాభాలను తీసుకొచ్చాడు సుధీర్. దీంతో మాస్ సినిమాతో సుధీర్‌ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసినట్టు అయింది. ఇలా ఇప్పుడు తన మీద పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయని తెలుసుకోవడంతో పూర్తి స్థాయిగా సినిమాల వైపు వెళ్లిపోయాడు సుధీర్.

జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోలను వదిలి వెళ్లిపోయాడు. సుధీర్ బుల్లితెరపై కనిపించడం దాదాపు తగ్గిపోయింది. అయితే చాలా రోజుల తరువాత మళ్లీ బుల్లితెరపైకి వచ్చాడు సుధీర్. అది కూడా రష్మీతో కలిసి కనిపించాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో థాంక్యూ స్పెషల్ ఎపిసోడ్ రన్ చేయబోతోన్నారు. ఈ ఎపిసోడ్‌కు ఈటీవీతో అనుబంధం ఉన్న వారిని తీసుకొచ్చారు. తేజ, ఆర్పీ పట్నాయక్ వంటి వారు కూడా కనిపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News