Pushpa 2 Tickets: భారీగా పుష్ప 2 టికెట్ ధరలు, తెలంగాణ కంటే ఏపీలో తక్కువే

Pushpa 2 Tickets: ఎప్పట్నించో వేచి చూస్తున్న పుష్ప 2 ది  రూల్ మొత్తానికి ఎల్లుండి విడుదల కానుంది. దేశమంతా ఇప్పుడు పుష్ప 2 చర్చ నడుస్తోంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలకు రెక్కలొచ్చేశాయి. భారీగా  టికెట్ ధరలు పెరిగిపోయాయి. ఆ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 3, 2024, 09:47 AM IST
Pushpa 2 Tickets: భారీగా పుష్ప 2 టికెట్ ధరలు, తెలంగాణ కంటే ఏపీలో తక్కువే

Pushpa 2 Tickets: ఐకాన్ స్టార్ పాన్ ఇండియా నటుడు అల్లు అర్జున్ నటించిన సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి లభించింది. విడుదలకు ముందు రోజే ప్రత్యేక షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. 

పుష్ప 2 ది రూలింగ్ డిసెంబర్ 5వ తేదీన పెద్దఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణల్లో ముందు రోజు అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు ప్రత్యేక షో వేసేందుకు అనుమతి లభించింది. రెండు రాష్ట్రాల్లోనూ ముందురోజే బెనిఫిట్ షో పడనుంది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు ఒక బెనిఫిట్ షో, డిసెంబర్ 5 తెల్లవారుజామున 1 గంటకు మరో బెనిఫిట్ షో పడనుంది. దీనికి సంబంధించి ఏపీలో పుష్ప 2 ది రూల్ రేట్లు ఇలా ఉండనున్నాయి. 

బెనిఫిట్ షో టికెట్ ధర 944 రూపాయలు
రిలీజ్ డే సింగిల్ స్క్రీన్ 297.50 రూపాయలు
మల్టీప్లెక్స్ టికెట్ ధర 377 రూపాయలు
మొదటి రోజు ఆరు షోలకు అనుమతి
డిసెంబర్ 6 నుంచి 17 వరకూ రోజుకు 5 షోలు

పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ బుకింగ్స్ ఇవాళ ఓపెన్ కానున్నాయి. ఏపీ, తెలంగాణల్లో ప్రతి థియేటర్‌లో పుష్ప 2 విడుదలయ్యేట్టు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీలో కంటే తెలంగాణలో టికెట్ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పరిమితి మేరకు పుష్ప 2 టికెట్ ధరలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. 

Also read: Vijayawada Metro Rail: విజయవాడ మెట్రో రైలులో కీలక పరిణామం.. త్వరలోనే పట్టాలపైకి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News