Pushpa The Rise hits 5 Billion views: ఏ ముహూర్తాన అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్టర్గా పుష్ప మొదటి భాగం ప్రారంభించారో తెలియదు కానీ సినిమా ప్రారంభించిన వాటి నుంచి అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతుంది. ఇక తాజాగా ఈ సినిమా ఇండియా సినీ హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డును సృష్టించింది.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పుష్ప ది రైజ్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాను ఏక భాగంగానే విడుదల చేయాలనుకున్నారు.
కానీ సినిమా నిడివి బాగా పెరగడంతో రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. అలా మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటన అలాగే పుష్ప రాజు పాత్రలో అల్లు అర్జున్ నటన కూడా తెలుగు సహా అన్ని భాషల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. తెలుగు సహా మీద భాషల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందో ఒక్క హిందీలోనే అంత కలెక్షన్స్ రాబట్టి నార్త్ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయింది.
అయితే ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా బాగా ప్లస్ అయింది. ఒకటి రెండు సాంగ్స్ కాకుండా దాదాపుగా అందించిన అన్ని సాంగ్స్ కూడా మంచి చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. అందుకే ఈ సినిమా పాటలు భారతదేశ వ్యాప్తంగానే గాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఫేమస్ అయ్యాయి. చాలామంది సినిమాలో పాటలకు, రీల్స్, టిక్ టాక్ లు చేస్తూ పుష్ప మేనరిజం చూపిస్తూ చాలా రోజులపాటు ట్రెండింగ్ లో ఉండేట్టు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఒక అద్భుతమైన రికార్డు సృష్టించింది.
భారతదేశ సినీ చరిత్రలోనే 500 బిలియన్ న్యూస్ సాధించిన సినీ ఆల్బమ్ గా పుష్పా సినిమా ఆల్బమ్ నిలిచినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా అదే సంస్థ ఇప్పుడు ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఖరారు చేసింది. మొత్తం మీద పుష్ప మొదటి భాగం నెలకొల్పిన రికార్డులు, బద్దలు కొట్టిన రికార్డులు రెండో భాగానికి మరింత పోటీ కల్పించే విధంగా మారాయి. మరి రెండో భాగాన్ని సుకుమార్ అండ్ టీం ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: Hero Sushanth: యాంకర్ పై సుశాంత్ ఆగ్రహం.. ఆ పద్ధతి కరెక్ట్ కాదంటూ ఫైర్!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.