రామ్‌గోపాల్‌వర్మ విచారణకు రాకపోతే.. అరెస్టే..!

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్‌టీ) పేరుతో చిత్రాన్ని తీసి.. శృంగారం పేరుతో ఆశ్లీలాన్ని ప్రమోట్ చేస్తున్నారంటూ ఫిర్యాదు అందిన క్రమంలో రామ్‌గోపాల్‌వర్మ పై కేసు నమోదు చేశామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ గురువారం మీడియాకి తెలిపారు.

Last Updated : Feb 2, 2018, 04:52 PM IST
రామ్‌గోపాల్‌వర్మ విచారణకు రాకపోతే.. అరెస్టే..!

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్‌టీ) పేరుతో చిత్రాన్ని తీసి.. శృంగారం పేరుతో ఆశ్లీలాన్ని ప్రమోట్ చేస్తున్నారంటూ ఫిర్యాదు అందిన క్రమంలో రామ్‌గోపాల్‌వర్మ పై కేసు నమోదు చేశామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ గురువారం మీడియాకి తెలిపారు. ఈ ఫిర్యాదులో భాగంగా ఆయన విచారణకు హాజరు కావాలని తాకీదు పంపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఒకవేళ ఈ తాకీదుకు స్పందించకపోతే.. అవసరాన్ని బట్టి తాము అరెస్టు చేయగలమని ఆయన ప్రకటించారు. ఇప్పటికే జీఎస్‌టీ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ వస్తున్న క్రమంలో.. విచారణ జరిపి నిషేధించే సూచనలు కనిపిస్తున్నాయని పలువురు ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. అలాగే ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న విమియో వీడియా ప్లాట్‌ఫారమ్‌కి ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు  సమాచారం అందించారు.  వివాదాస్పదమైన ఆ చిత్రంపై కేసు నమోదైందని.. అందుకే ఆ చిత్రానికి ఆ ప్లాట్‌ఫారంలో పెయిడ్ యాక్సెస్ కూడా లేకుండా చేయాలని తెలిపారు. 

రామ్‌గోపాల్‌వర్మ ఇటీవలే గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్‌టీ) పేరుతో హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాని పెట్టి ఓ 20 నిమిషాల చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోరుని ఎం.ఎం.కీరవాణి అందించారు. ఆ చిత్రంపై గతకొంతంగా పలు ప్రజాసంఘాలు విమర్శలు గుప్పించడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఆ సినిమాపై పాజిటివ్‌గా మాట్లాడుతున్నారన్న కారణంతో విమర్శకుడు కత్తి మహేష్, నటి గాయత్రి గుప్తాలపై కూడా మాటల దాడి జరిగింది.

ఈ క్రమంలో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఈ చిత్రాన్ని ఓ వెబ్ సైటుతో పాటు విమియోలో కూడా విడుదల చేసిన వర్మ.. దానిని డౌన్లోడ్ చేసుకోవడానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని కూడా తెలిపారు. పేమెంట్ గేట్ వే ద్వారా డబ్బు చెల్లించి ఆ చిత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

Trending News