రామ్ గోపాల్ వర్మ "కడప" ట్రైలర్ విడుదల

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ పేరే 'కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’. 

Last Updated : Dec 15, 2017, 06:37 PM IST
రామ్ గోపాల్ వర్మ "కడప" ట్రైలర్ విడుదల

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ పేరే 'కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’. ఆయన తీస్తున్న తొలి అంతర్జాతీయ వెబ్ సిరీస్ అయిన ఈ చిత్రంలో కడపలో ఇప్పటి వరకు చెలరేగిన హత్యోదంతాలు, రక్తపుటేరులపై నూటికి నూటి శాతం నిజాలనే చూపించదలిచానని వర్మ ప్రకటించారు.  ‘కడప.. కడప..’ అంటూ వస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఈ వెబ్ సిరీస్‌‌కు హైలెట్‌గా నిలిచిందని ఇప్పటికే వర్మ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం.

ఎన్‌అండ్‌ఎన్‌ క్రియేషన్స్‌, ఏ కంపెనీ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. సినిమాలకు సెన్సార్ ఉండడం వల్ల చాలా సందర్భాల్లో తాను అనుకున్న అంశాలు చిత్రాల్లో చూపించడం కుదరలేదని.. అయితే వెబ్ సిరీస్ విషయంలో మాత్రం తన ఆలోచనలను తగ్గట్టుగా, భయం లేకుండా నిజాలు బట్టబయలు చేస్తానని వర్మ ప్రకటించారు. 

 

Trending News