Ante Sundaraniki : నాని 'అంటే సుందరానికి' నుంచి 'రంగో రంగా..' లిరికల్ సాంగ్ రిలీజ్

Ante Sundaraniki: హీరో నాని 'అంటే సుందరానికి' మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజైంది. 'రంగో రంగా..' అంటూ సాగే ఈ పాటను సింగర్ కారుణ్య అలపించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 05:12 PM IST
Ante Sundaraniki : నాని 'అంటే సుందరానికి' నుంచి 'రంగో రంగా..' లిరికల్ సాంగ్ రిలీజ్

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని (Nani), మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ (Nazriya Nazim)  హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'అంటే సుందరానికి' (Ante Sundaraniki). రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఒక బ్రాహ్మణ యువకుడికీ, క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే లవ్ స్టోరీగా ఈ  చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. నరేష్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'రంగో రంగా..' (Rango Ranga lyrical song) అంటూ సాగే ఈ పాటను సింగర్ కారుణ్య అలపించాడు. లిరిక్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. ఈ సినిమా జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. శ్యామ్ సింగరాయ్ మూవీ సక్సెస్ తో పుల్  జోష్ మీద ఉన్న నానికి ఈ చిత్రం ఏ మేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి. 

నాని ఇతర సినిమాలకొస్తే... 
కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో 'దసరా' అనే చిత్రంలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం నాని తెలంగాణ యువకుడి పాత్రలో నటించనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. 

Also Read: Major Movie: 'మేజర్' కొత్త ప్రయోగం.. భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News