Devi Sri Prasad Dance Video: దేవిశ్రీప్రసాద్ తో బాలీవుడ్ హీరో..ఉ అంటావా మామకు అదిరిపోయే స్టెప్పులు

DSP- Ranveer Singh Dance Video: పుష్ప సినిమాలో ఊ అంటావా మామ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ పాటకు దేవిశ్రీప్రసాద్.. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ వేసిన స్టెప్పులు మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 30, 2024, 09:54 AM IST
Devi Sri Prasad Dance Video: దేవిశ్రీప్రసాద్ తో బాలీవుడ్ హీరో..ఉ అంటావా మామకు అదిరిపోయే స్టెప్పులు

Shankar Daughter Sangeet Function: తమిళ దర్శకుడు శంకర్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు శంకర్ సినిమాలు తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అందుకే ఆయనకు తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి తోడు ప్రస్తుతం శంకర్ తెలుగు హీరో రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ దర్శకుడు కూతురు పెళ్లి ఈ మధ్యనే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి ఎంతోమంది సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు.

ఈ పెళ్లి సంగీత్ పార్టీలో పలువురు సెలబ్రిటీలు కొత్త జంటతో కలిసి డ్యాన్సులు కూడా వేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కలిసి పుష్ప సినిమాలోని పాటకు వేసిన డాన్స్ అందరిని ఆకట్టుకుంటుంది.

తాజాగా నిన్న ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ రణవీర్ తో కలిసి వేసిన డాన్స్ వీడియోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసాడు. షేర్ చేసిన కాసేపటికి ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వీరిద్దరూ శంకర్ కూతురి పెళ్ళిలో ఈ డాన్స్ వేశారు. రణవీర్, దేవిశ్రీ ప్రసాద్ కలిసి పుష్ప సినిమాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఊ అంటావా ఊ ఊ అంటావా పాటకు ఓ రేంజ్ లో ఊపేసారు. శంకర్ కూతురు కూడా వీళ్ళతో కలిసి డాన్స్ వెయ్యడం విశేషం. ఇక ఈ వీడియోలో శంకర్, అతని ఫ్యామిలీ కూడా పక్కనే ఉన్నారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Devi Sri Prasad (@thisisdsp)

ముఖ్యంగా ఈ వీడియోలో రణవీర్ డాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. సమంతాను మించిపోయి ఈ హీరో స్టెప్పులు వేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక శంకర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ దర్శకుడు కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్రంతో పాటు రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలలో ముందుగా కమల్ హాసన్ సినిమా విడుదలవ్వగా ఆ తరువాత ఈ సంవత్సరం చివరిగా రామ్ చరణ్ చిత్రం విడుదల కానుందని వినికిడి. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ గురించి మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News