వెండితెర అల్లావుద్ధీన్ ఖిల్జీ ఇతడే..!

Last Updated : Oct 3, 2017, 12:13 PM IST
వెండితెర అల్లావుద్ధీన్ ఖిల్జీ ఇతడే..!

13వ శతాబ్దంలో భారతదేశాన్ని ఏలిన ముస్లిం చక్రవర్తి అల్లావుద్ధీన్ ఖల్జీ. ఢిల్లీ సుల్తాన్‌గా వ్యవహరిస్తున్న రోజుల్లోనే చిత్తోర్ యువరాణి పద్మావతి అందాన్ని గురించి విని, ఆమెను పొందడం కోసం.. ఆమె రాజ్యంపై ఖిల్జీ దండెత్తి వచ్చాడని ఓ కథ ప్రచారంలో ఉంది. ఇప్పుడు దీపికా పడుకొణే ప్రధాన పాత్రధారిగా బాలీవుడ్‌లో "పద్మావతి" చిత్రం తెరకెక్కుతున్న సందర్భంలో, మొన్నటివరకూ ఖిల్జీ పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవలే నిర్మాతలు ఖిల్జీ పోస్టర్‌ను విడుదల చేశారు. క్రూరత్వం నిండిన చూపులతో రణ్‌వీర్ సింగ్ అభినవ ఖిల్జీగా ఆ పోస్టర్‌లో దర్శనమివ్వడం  విశేషం. ఇదే చిత్రంలో పద్మావతి భర్త రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటించడం గమనార్హం. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం, డిసెంబరు 1వ తేదీన విడుదల కాబోతుంది. 

Trending News