Chiranjeevi: ఇన్ని సంవత్సరాలకు తీరిన కోరిక.. మెగాస్టార్ సినిమాలో పాపులర్ నటుడికి ఛాన్స్

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ నుంచి ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ విలన్ కు సంబంధించి ఒక యాక్టర్ ను కన్ఫర్మ్ చేసినట్లు టాక్. అయితే ఈ విషయంలో చిరంజీవి తన మాట నిలబెట్టుకుంటున్నారు అంటూ ఓ పాత వీడియో కూడా వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2024, 07:42 PM IST
Chiranjeevi: ఇన్ని సంవత్సరాలకు తీరిన కోరిక.. మెగాస్టార్ సినిమాలో పాపులర్ నటుడికి ఛాన్స్

Vishwambhara Update: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ విశ్వంభర. ప్రస్తుతం సెట్స్ పై యమ బిజీగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేస్తోంది చిత్ర బృందం. ఈ మూవీకు బింబిసారా చిత్రం ఫేమ్ వశిష్ట దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తాజాగా విలన్ పాత్రకు సంబంధించి ఓ అప్డేట్ వైరల్ అవుతోంది.

ఈ మూవీలో విలన్ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ స్టార్స్ ను పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఆ పాత్రకు రావు రమేష్ కరెక్ట్ గా సరిపోతారు అని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం ఈ న్యూస్ తో పాటు గతంలో చిరంజీవి, రావు రమేష్ గురించి మాట్లాడిన ఒక వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. 

 

ఒక ప్రీ రిలీజ్ వేడుకలో రావు రమేష్ గురించి ప్రస్తావించిన చిరంజీవి.. ‘రావు గోపాల్ రావు గారు లేని స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు ఎన్నో ఉన్నతమైన పాత్రలు వేస్తూ.. ఇంకా అత్యుత్తమమైన స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాను.. అలాగే నాతో కూడా ఒక సినిమా చెయ్యి ఇదే నా కోరిక ..’అని అన్నారు.

అప్పట్లో రావు గోపాల్ రావు విలన్ గా ..చిరంజీవి హీరోగా ఎన్నో సినిమాలు వచ్చాయి. వారి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ గా ఉండేది. ఒకపక్క రావు గోపాల్ రావు సెటైరికల్ డైలాగ్స్ కి.. చిరంజీవి మాస్ కౌంటర్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవి. తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత రావు గోపాల్ రావు కొడుకు ..రావు రమేష్ చిరంజీవితో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి మాట్లాడిన పాత వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఇద్దరి కాంబోలో మూవీ ఎలా ఉంటుందో చూడాలని చిరు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.

ఈ మూవీ స్టార్ కాస్టింగ్ విషయానికి వస్తే.. ఎక్కడ కాంప్రమైస్ కాకుండా క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే యాక్టర్ లని ఎంచుకుంటుంది చిత్ర బృందం. త్రిష ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా..జెంటిల్‌మెన్ ఫేమ్
సురభి ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఈషా చావ్లా,రమ్య పసుపులేటి కూడా విశ్వంబరం మూవీలో మంచి ఛాన్స్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ లో ఓ ప్రత్యేకమైన సెట్ లో ఫ్యామిలీ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ మూవీలో చిరంజీవి పోషిస్తున్న పాత్ర పేరు దొరబాబు అని టాక్. ఈసారి రాబోయే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయడానికి ఈ చిత్రం అన్ని విధాల సిద్ధమవుతోంది.

Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!

Read More: Pooja Hegde: పొట్లంకట్టిన బిర్యానికి బొట్టు బిళ్ళ పెట్టినట్టు.. ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే ఫోటోలు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News