Renu Desai: ఫైనల్ గా పవన్ గెలుపు పై స్పందించిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్

Pawan Kalyan : పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్ధి వంగా గీత‌పై 68,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాల గురించి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం స్పందించింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 4, 2024, 06:40 PM IST
Renu Desai: ఫైనల్ గా పవన్ గెలుపు పై స్పందించిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్

Pawan Kalyan -Renu Desai: పవన్ కళ్యాణ్ అభిమానుల సంసారాలు అంబరాన్ని అందుతున్నాయి. పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా భారీ మెజారిటీ వస్తూ ఉండటంతో.. మధ్యాహ్నం నుంచే సోషల్ మీడియా మొత్తం పవన్ నామస్మరణం జరుగుతోంది. ఆయన గెలుపు పై ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా పోస్టులు వేస్తున్నారు. ఇక అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా మొత్తం పవర్ ఎలివేషన్ వీడియోస్ తో.. పవన్ డైలాగ్స్ తో నింపేస్తున్నారు.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా పవన్ గెలుపు గురించి ఇన్ డైరెక్ట్ పోస్ట్ చేసింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. పిఠాపురం.. నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేసి ..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఘ‌న విజ‌యం సాధించారు. కాగా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం.. టిడిపి బిజెపి జెఎస్పి కలిసి ఏర్పరిచిన కూటమిలో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించారు. 

ఇక దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను అభినందిస్తూ సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులతో పాటు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మాజీ భార్య రేణూ దేశాయ్ సైతం స్పందించారు. రేణు దేశాయ్ కూతురు ఆద్య టీ గ్లాస్ పట్టుకున్న వీడియోని తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక ‘ఈ గెలుపుతో ఆద్య అండ్ అకిరా ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు కూడా ఈ విజ‌యంతో ల‌బ్ది పొందుతార‌ని నేను ఆశిస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఎక్కడా కూడా రేణు దేశాయ్ పవన్ పేరు ప్రస్తావించకపోవడం గమనర్హం.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..

Read more: Retired Soldier: విషాదకర ఘటన.. స్టేజీ మీద కుప్పకూలీన రిటైర్డ్ ఆర్మీ అధికారి.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News