Rishab Shetty - Rashmika Mandanna: రష్మికకి అంత పొగరా?.. తిక్క తీర్చిన రిషభ్ శెట్టి.. వీడియో వైరల్

Rishab Shetty - Rashmika Mandanna War: రష్మిక మందన తన మొదటి సినిమా, మొదటి ప్రొడక్షన్ కంపెనీ పేరు చెప్పేందుకు కూడా ఇష్టపడటం లేదు. దీంతో జనాలు ఆమెను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 02:03 PM IST
  • కిరిక్ పార్టీతో ప్రయాణం మొదలు
  • రక్షిత్, రిషభ్, రష్మికలకు అదే బ్రేక్
  • రష్మికపై రిషభ్ కౌంటర్ వీడియో
Rishab Shetty - Rashmika Mandanna: రష్మికకి అంత పొగరా?.. తిక్క తీర్చిన రిషభ్ శెట్టి.. వీడియో వైరల్

Rishab Shetty Satires on Rashmika Mandanna: రష్మిక మందన కెరీర్‌కు కిరిక్ పార్టీ ఎలా బ్రేక్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు రిషభ్ శెట్టి దర్శకుడు కాగా.. హీరోగా రక్షిత్ శెట్టి నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. రిషభ్ శెట్టి, రక్షిత్ శెట్టిలకు ముందు నుంచే స్నేహం ఉంది. ఇద్దరూ మంచి స్నేహితులే. ఇక ఈ మూవీ షూటింగ్ సమయంలోనే రష్మిక, రక్షిత్‌ల మధ్య ప్రేమ చిగురించింది. అది నిశ్చితార్థం వరకు వెళ్లింది. అయితే అదే సమయంలో రష్మికకు తెలుగులో ఛలో రూపంలో పెద్ద హిట్ వచ్చి దశ తిరిగింది. దీంతో ప్రేమ, పెళ్లి అనేవి పక్కన పెట్టేసి కెరీర్ మీద ఫోకస్ పెట్టేసింది.

 

అలా రక్షిత్ శెట్టికి హ్యాండ్ ఇచ్చింది రష్మిక మందన. అయితే ఇప్పుడు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్నారు. చార్లీ 777 సినిమాతో రక్షిత్ శెట్టి నేషనల్ వైడ్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రిషభ్ శెట్టి పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇండియాలో నాలుగు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి రిషభ్ శెట్టిని పాన్ ఇండియన్ హీరోగా, దర్శకుడిగా చేసింది. అయితే ఈ రెండు చిత్రాల మీద రష్మిక మాత్రం స్పందించలేదు. దీంతో జనాలు ఆమెను దారుణంగా ట్రోల్స్ చేశారు. ఆ ట్రోలింగ్ వల్ల తాను చాలా బాధపడ్డానని రష్మిక చెప్పుకొచ్చింది.

 

తాజాగా రష్మిక ఓ వీడియోలో ఇలా మాట్లాడింది. తన మొదటి సినిమా అవకాశం, కెరీర్ స్టార్టింగ్ గురించి చెబుతూ.. సో కాల్డ్ ప్రొడక్షన్ కంపెనీ అంటూ చేతులతో వింత సైగలు చేసింది. కనీసం నీకు కెరీర్ ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు కూడా చెప్పుకోలేకపోతోన్నావ్.. అంత బలిసిందా? అంత పొగరా? అంటూ కన్నడిగులు రష్మిక మీద ఫైర్ అవుతున్నారు.

అందుకే రిషభ్ శెట్టి కూడా రష్మికకు సరిపోయేలా సెటైర్ వేశాడని ఆ వీడియోను కూడా షేర్ చేస్తున్నారు జనాలు. సాయి పల్లవి, సమంత, రష్మిక, కీర్తి సురేష్ ఇలా చాలా మంది ఉన్నారు కదా? వీరిలో ఎవరితో పని చేయాలని అనుకుంటున్నారు అని రిషభ్ శెట్టిని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. కథ, స్క్రిప్ట్ రెడీ అయితే.. దానికి ఎవరు సూట్ అయితే వారితోనే చేస్తాను అని, అయినా కూడా తనకు సాయి పల్లవి, సమంతలతో పని చేయాలని ఉందని అన్నాడు. ఇలా చేతులతో సైగలు చేసే వారితో అయితే పని చేయను అంటూ రష్మికకు కౌంటర్ వేశాడు రిషభ్.

Also Read : HIT 2 Trailer : HIT 2 కచ్చితంగా హిట్టే.. వేరే లెవెల్‌లో ట్రైలర్‌

Also Read : Krishna indira devi Marriage : సూపర్ స్టార్ కృష్ణ-ఇందిరా దేవీ పెళ్లి రోజు.. మహేష్‌ సోదరి మంజుల ఎమోషనల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News