Jr Ntr హోస్ట్ చేస్తోన్న Evaru Meelo Koteswarulu షోలో ఆర్ఆర్ఆర్ ప్రోమో ?

ఆర్ఆర్ఆర్ మూవీలో తారక్ (Jr Ntr) కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ (Ram Charan) అల్లూరి సీతా రామరాజు పాత్ర పోషిస్తున్నాడు. మరో స్వాతంత్ర్య సమరయోధుడు పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ (Ajay Devgn) నటిస్తున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 17, 2021, 01:48 PM IST
Jr Ntr హోస్ట్ చేస్తోన్న  Evaru Meelo Koteswarulu షోలో ఆర్ఆర్ఆర్ ప్రోమో ?

Jr NTR’s Evaru Meelo Koteswarulu tv show: జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న ఎవరు మీలో కోటీశ్వరుడు రియాలిటీ గేమ్ షోపై యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్న ఎవరు మీలో కోటీశ్వరుడు టీవీ షో తొలి ఎపిసోడ్‌లో రామ్ చరణ్ తొలి అతిథిగా రానుండటమే. అంతేకాదండోయ్.. తారక్, చెర్రీ ఇద్దరూ కలిసి నటిస్తున్న అప్‌కమింగ్ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఒక చిన్న ప్రోమో (RRR movie promo) కూడా విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఎవరు మీలో కోటీశ్వరుడు షోతో పాటు ఆర్ఆర్ఆర్ ప్రోమో కూడా చూడవచ్చని ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ అక్టోబర్ 13న భారీ సంఖ్యలో థియేటర్లతో అభిమానుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో ఈ విధంగా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కూడా ప్రారంభిస్తున్నట్టు టాలీవుడ్ టాక్. ఇప్పటికే పలు ప్రత్యేక సందర్భాల్లో, పలు వేదికలపై ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie) ప్రమోషన్స్ వీడియోలు, పోస్టర్లు విడుదల కాగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.    

Also read: Ram Charan: జాతీయ జెండాను అవమానించారంటూ చెర్రీపై ట్రోల్స్? అసలు ఏం జరిగింది?

ఆర్ఆర్ఆర్ మూవీలో (RRR movie) తారక్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ (Ram Charan) అల్లూరి సీతా రామరాజు పాత్ర పోషిస్తున్నాడు. మరో స్వాతంత్య్ర సమరయోధుడు పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ (Ajay Devgn) నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి అలియా భట్ సీత పాత్రలో చెర్రీకి జంటగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

Also read : Indian Idol: సీజన్‌-12 విజేత పవన్‌దీప్‌ రాజన్‌..ఆరోస్థానంలో షణ్ముఖప్రియ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News