Sai Dharam Tej: ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ట్రైలర్ రిలీజ్

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్, నభా నటేశ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ (Solo Brathuke So Better ). ఇటీవలనే ఈ చిత్రాన్ని డిసెంబరు 25న థియేటర్లల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Last Updated : Dec 20, 2020, 08:29 AM IST
Sai Dharam Tej: ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ట్రైలర్ రిలీజ్

Solo Brathuke So Better Movie Trailer Released: మెగా హీరో సాయిధరమ్‌ తేజ్, నభా నటేశ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ (Solo Brathuke So Better). ఇటీవలనే ఈ చిత్రాన్ని డిసెంబరు 25న థియేటర్లల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకులు, మెగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ట్రైలర్‌ను చూస్తుంటే.. సాయి ధ‌ర‌మ్ తేజ్ (sai dharam tej) మొదట పెళ్లికి దూరంగా ఉండి సోలోగా బతకాలని అనుకుంటాడు.. న‌భా న‌టేష్‌ని క‌లిసిన త‌ర్వాత త‌న అభిప్రాయంలో మార్పులు వ‌స్తాయానని అర్ధ‌మ‌వుతుంది. అయితే దీనిలో రావు రమేష్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, నరేష్ కూడా నటించారు. Also read: Priya Prakash Varrier: అందాలతో కనువిందు చేస్తున్న ప్రియా ప్రకాష్

లవ్ అంట్ ఎంటర్టైన్‌మెంట్ కథాంశంతో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై జీ స్టూడియోస్‌ భాగస్వామ్యంతో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) మెగా సాయి ధరమ్ తేజ్ దేవ కట్టా దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. Also read: అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన సాయి ధరమ్ తేజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News