Sai Dharam Tej: సాయి ధరమ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ఫిక్స్

ప్రతీ రోజు పండగే చిత్రం విజయం తరువాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. ఈ విజయాన్ని క్యాష్ చేసుకోవడంలో విన్నర్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్.

Last Updated : Nov 6, 2020, 09:33 PM IST
    • ప్రతీ రోజు పండగే చిత్రం విజయం తరువాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు.
    • ఈ విజయాన్ని క్యాష్ చేసుకోవడంలో విన్నర్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్.
    • దేవకట్టతో ఒక సినిమా చేయడానికి విన్నర్ నటుడు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.
Sai Dharam Tej: సాయి ధరమ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ఫిక్స్

ప్రతీ రోజు పండగే చిత్రం విజయం తరువాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. ఈ విజయాన్ని క్యాష్ చేసుకోవడంలో విన్నర్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ). దేవకట్టతో ఒక సినిమా చేయడానికి విన్నర్ నటుడు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి రిపబ్లిక్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. Also Read | Wild Dog Photos: వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జున

దేవకట్ట తెరకెక్కించనున్న రిపబ్లిక్ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ యువ ఐఏఎస్ ( IAS) అధికారి పాత్రలో కనిపించనున్నారట. ఈ పాత్రలో ఇమిడిపోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాడట. కొంత మంది యువ బ్యూరోక్రాట్ల బాడీ లాంగ్వేజ్, వారి స్టైల్ ను గమనిస్తున్నాడట. ముఖ్యంగా  కొత్తగా సర్వీసులో చేరిన వర్కింగ్ స్టైల్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడట. 

Also Read | ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ లొకేషన్ నుంచి Prabhas Latest Photos 
ఐఏఎస్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ కరెక్టుగా సెట్ అవుతాడు అని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. యంగ్ బ్యూరోక్రాట్ రోల్ చేయడానికి  అతను సరిపోతాడని ఫిక్స్ అయ్యారట. రిపబ్లిక్ చిత్రంలో బాహుబలి శివగామి లాంటి పవర్ ఫుల్ పాత్ర చేసిన రమ్య కృష్ణ ( Ramya Krishna ) అంతే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుందట.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News