OTT Theatre Movies : ఈ వారం ఓటీటీ, థియేటర్ సినిమాలు.. బాలీవుడ్‌లో సల్మాన్, టాలీవుడ్‌లో సుప్రీమ్ హీరో

This Week OTT Theatre Movies ఈ వారం బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ కనిపించడం లేదు. సల్మాన్ ఖాన్ సినిమా తెలుగులో వచ్చినా పెద్దగా ఎఫెక్ట్ చూపించేలా లేదు. ఇక ఈ వారం అంతో ఇంతో ఇంట్రెస్ట్ క్రియేట్ కలిగించే సినిమా ఏదైనా ఉందంటే.. అది విరూపాక్ష మాత్రమే.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 02:15 PM IST
  • ఈ వారం ఓటీటీ, థియేటర్ సినిమాలివే
  • బాక్సాఫీస్ వద్ద కనిపించని పోటి
  • అక్కడ సల్మాన్, ఇక్కడ సాయి ధరమ్ తేజ్
OTT Theatre Movies : ఈ వారం ఓటీటీ, థియేటర్ సినిమాలు.. బాలీవుడ్‌లో సల్మాన్, టాలీవుడ్‌లో సుప్రీమ్ హీరో

This Week OTT Theatre Movies ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఓటీటీ, థియేటర్లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే ఈ గత వారం, ఈ వారం కూడా థియేటర్లలో సందడి కనిపించకుండా పోయింది. ఓటీటీలోనూ పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్న సినిమాలేవీ రావడం లేదు ఇప్పుడు. అయితే ఈ వారం మాత్రం సల్మాన్ ఖాన్ బాలీవుడ్లో సందడి చేయబోతోన్నాడు. అదే సమయంలో తెలుగులో సాయి ధరమ్ తేజ్ రెడీగా ఉన్నాడు.

సల్మాన్ ఖాన్ వెంకటేష్ పూజా హెగ్డేలు ప్రధాన పాత్రలో నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా ఈద్ సందర్భంగా ఏప్రిల్ 21న విడుదల కాబోతోంది. అయితే సల్మాన్ ఖాన్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాలను నిలబెట్టలేవని ఆల్రెడీ ఇది వరకు ఎన్నో చిత్రాలు ఫ్రూవ్ చేశాయి. మితి మీరిన యాక్షన్ సీక్వెన్స్‌లు, సల్మాన్ వింత జుట్టు, వింత స్టెప్పులు ఎంతగా ట్రోలింగ్‌కు గురయ్యాయో అందరికీ తెలిసిందే.

ఇక ఈ సినిమా తెలుగులోనూ విడుదలయ్యేలా ఉంది. అయినా ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించేలా కనిపించడం లేదు. ఇక ఇది కాకుండా ఏప్రిల్ 21న తెలుగు రాష్ట్రాల్లో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా సందడి చేయనుంది. సుకుమార్ శిష్యుడు కార్తిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో అందరిలోనూ ఇంట్రెస్ట్ ఏర్పడింది. ట్రైలర్ బాగానే ఆసక్తిని పెంచేసింది. ఈ హారర్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్

సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం మామూలు విషయం కాదు. గార్గేయి హీరోయిన్‌గా సింగిల్ కారెక్టర్‌తో హలో మీరా అనే సినిమా రాబోతోంది. ఈ మూవీ ఏప్రిల్ 21న థియేటర్లో సందడి చేయనుంది. ఈ వారం ఈ మూడు సినిమాలే అంతో ఇంతో జనాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక ఓటీటీలోనూ తెలుగు వాళ్లకు పరిచయమున్న, ఆసక్తికరమైన సినిమాలేవీ కనిపించడం లేదు.

Also Read: Saif Ali Khan Joins NTR 30 : ఎన్టీఆర్ కోసం రంగంలోకి సైఫ్ ఆలీ ఖాన్.. స్టిల్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News