Saindhav Collections Day 1: వెంకటేష్ 75 వ సినిమా కలెక్షన్స్…ఎవ్వరు ఊహించి ఉండరు

Saindhav: వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం సైంధవ్. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకునింది. కాగా ఈ చిత్రం మొదటి రోజు ఎంత కలెక్షన్ సాధించిందో ఒకసారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2024, 05:30 PM IST
Saindhav Collections Day 1: వెంకటేష్ 75 వ సినిమా కలెక్షన్స్…ఎవ్వరు ఊహించి ఉండరు

Saindhav Box-office Collections: విక్టరీ వెంకటేష్ 75వ సినిమా అనగానే తెలుగు ప్రేక్షకులలో అంచనాలు నెలకొన్నాయి. పక్కా ఫ్యామిలీ హీరో అయిన వెంకటేష్ తన 75 వ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీస్తారు అని అనుకున్నారు అందరూ. కానీ అందరిని ఆశ్చర్యపరిస్తూ వెంకటేష్ తన 75వ సినిమాగా సైంధవ్ లాంటి యాక్షన్ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలై మొదటి షో నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

హిట్ సినిమా తీసిన దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్యలు కీలక పాత్రలను చేయగా.. శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియా, రుహానీ శర్మ హీరోయిన్లుగా నటించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

ఈ సినిమాకి సీడెడ్‌లో రూ. 3.00 కోట్లు, నైజాంలో రూ. 7.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 9.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 19.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.02 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 4.2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 25.00 కోట్లు ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.

అయితే ఈ వెంకటేష్ సినిమాకి పోటీగా ఆల్రెడీ సంక్రాంతి సినిమాలు మహేష్ బాబు గుంటూరు కారం, ప్రశాంతి వర్మ హనుమాన్ కూడా ఉండటంతో సైంధవ్ సినిమాకి అనుకున్న స్థాయిలో మొదటి రోజు కలెక్షన్ రాలేదు.  ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1100 థియేటర్లలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగకపోవడంతో  ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కేవలం రూ. 3.50 కోట్లు వరకూ షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.50 కోట్లు వసూలు చేసిందని సమాచారం.

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో ఎమోషనల్ కంటెంట్ మిళితం చేసి రూపొందించిన సైంధవ్ చిత్రానికి మిశ్రమ స్పందన రావడంతో మొదటి రోజు మార్నింగ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, మ్యాట్నీకి 45 శాతం, ఫస్ట్ షోకు 50 శాతాం, అలాగే సెకండ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. కానీ మొత్తం పైన మాత్రం ఈ చిత్రం వెంకటేష్ రేంజ్ లో మొదటిరోజు కలెక్షన్స్ తెచ్చుకోలేదని చెప్పాలి. ఇక ఈరోజు శనివారం ఈ సినిమా కలెక్షన్స్ మరింత డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. మొదటి వీకెండ్ కి ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాలి అంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. 

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News