Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కలకలం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Salman Khan: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 14, 2024, 08:25 AM IST
Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కలకలం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Salman Khan: బాలీవుడ్ సీనియర్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఇద్దరు గుర్తు తెలియని ఆగంతులు బైక్ పై వచ్చి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు ముంబై పోలీసులు గుర్తించారు.ఈ సంఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. గతంలో సల్మాన్ ఖాన్.. కృష్ణ జింకలను వేటాడిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ జింకలను ఆరాధించే బిష్ణోయ్ తెగకు చెందిన ప్రముఖ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోణ్ సల్మాన్‌ను చంపుతామంటూ అప్పట్లో బహిరంగ ప్రకటన చేసారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. పోలీసులు ఇతర ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర ఇలాంటి ఘటన చేసుకోవడంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం  ఎదురు చూస్తున్నారు. గతేడాది 'టైగర్ 3', పఠాన్ సినిమాలతో పలకరించారు. ఇందులో పఠాన్ మూవీలో అతిథి పాత్రలో మెరిసారు. మరోవైపు సల్మాన్ ఖాన్.. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఈద్ పండగ నేపథ్యంలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు సల్మాన్ ఖాన్.. కిక్ 2 సహా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Read More: Sonu Sood: షూ చోరీ చేసిన స్విగ్గీ డెలీవరీ బాయ్ కు సోనూసూద్ అండ.. కొత్త బూట్లు కొనివ్వండంటూ ట్వీట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News