/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Shilpa Reddy:మార్చి 8, 2024- మాజీ మిసెస్ ఇండియా శిల్పా రెడ్డి ఎలాంటి లాభాపేక్ష లేని రైజింగ్ శ‌క్తి ఫౌండేష‌న్ స్థాపించారు. ఈమె స‌మంత స‌న్నిహితురాలిగా సినిమా ఇండ‌స్ట్రీలో పేరు ఉంది.  రైజింగ్ శక్తి ఫౌండేషన్ను మార్చి 7న మేడ్చల్ లోని గాజులరామారంలో ఈమె అఫీషియల్‌గా ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్య‌క్ర‌మంలో 200 మంది మ‌హిళ‌లు పాల్గొన్నారు. మ‌హిళ‌లు, యువ‌త సాధికార దిశ‌గా ఈమె ప్రయాణం ప్రారంభించింది.  శిల్పారెడ్డి విష‌యానికొస్తే.. ఈమె మాజీ మిసెస్ ఇండియా, మోడ‌ల్‌గా ప‌లువురు సెల‌బ్రిటీల‌కు ఫిట్నెస్ ట్రెయిన‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. అందులో స‌మంత స‌హా ప‌లువురు హీరోయిన్స్ స‌హా సెల‌బ్రిటీలున్నారు. ఫౌండేష‌న్ ద్వారా ఎంతో మంది మ‌హిళ‌లు త‌మ కాళ్ల‌పై నిల‌బ‌డేలా ఈ ఫౌండేష‌న్ ప‌నిచేస్తుంద‌న్నారు. అంతేకాదు గ్రామీణాభివృద్ధి ల‌క్ష్యంగా ప‌లు కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించ‌నున్నారు.

రైజింగ్ శక్తి ఫౌండేషన్ ద్వారా మహిళలు మరియు యువతకు సాధికారత కోసం ప‌నిచేస్తుంద‌న్నారు. ఇందులో ఎలాంటి ప్రాఫిట్ కూడా లేద‌ని చెప్పారు. ఈ సంస్థ ద్వారా విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకతపై దృష్టి సారించనున్న‌ట్టు చెప్పారు.  భవిష్యత్ తరాలకు మరింత స్థిరమైన మరియు సమానమైన అవకాశాలు కలిగిన  ప్రపంచాన్ని క్రియేట్ చేసేంద‌కు ఈ ఫౌండేష‌న్ క‌ట్టుబ‌డి ఉంటుంద‌న్నారు.

శిల్పారెడ్డి ప్రారంభించిన ఈ ఫౌండేష‌న్‌ ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా  గోపాల్  26 ఫిబ్రవరి 2024న ప్రారంభించిన ముషీరాబాద్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం SRD (సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్)కి 12 లక్షల విలువైన జిమ్ పరికరాలను విరాళంగా అందించడం ద్వారా RSF ఇప్పటికే తన గ్రౌండ్ వర్క్‌ను షురు చేసింది.

తన లైఫ్‌లో ఈ ఫౌండేషన్  యొక్క ప్రాముఖ్యతను శిల్పా రెడ్డి వెల్లడిస్తూ , “తన జీవిత ప్రయాణంలో, తాను  పూర్తి లైఫ్‌ను అనుభవించాను. స‌మాజం నుంచి ఎంతో తీసుకున్న తాను.. ఆ  స‌మాజానికి తిరిగి ఇవ్వడానికి ఇది సరైన సమయం  అని నేను భావిస్తున్నాను. విద్య మరియు ఉపాధి ద్వారా మహిళలకు స్వేచ్ఛ లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ ఫౌండేషన్ ద్వారా, మహిళలకు సాధికారత కల్పించడం, వారి జీవితాల్లో నైపుణ్యాలను జోడించడం మరియు వారిలో స్వేచ్ఛా  జ్యోతిని వెలిగించడం కోసం నేను అంకితభావంతో ప‌నిచేస్తాన‌న్నారు.  
మీడియా సమాచారం కోసం సంప్రదించండి :
– 9908143716, randnationhyd@gmail.com

ఇదీ చదవండి: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతాలు పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Section: 
English Title: 
shilpa reddy rising shakthi foundation started samantha friend shilpa reddy ta
News Source: 
Home Title: 

Shilpa Reddy: లాభాపేక్షలేని  రైజింగ్ శక్తి ఫౌండేషన్‌ను ప్రారంభించిన స‌మంత ఫ్రెండ్ శిల్పా రెడ్డి..

Shilpa Reddy: లాభాపేక్షలేని  రైజింగ్ శక్తి ఫౌండేషన్‌ను ప్రారంభించిన స‌మంత ఫ్రెండ్ శిల్పా రెడ్డి..
Caption: 
Shilpa Reddy Foundation (X/Photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
లాభాపేక్షలేని రైజింగ్ శక్తి ఫౌండేషన్‌ను ప్రారంభించిన స‌మంత ఫ్రెండ్ శిల్పా రెడ్డి..
TA Kiran Kumar
Publish Later: 
No
Publish At: 
Friday, March 8, 2024 - 20:05
Created By: 
Kiran Kumar
Updated By: 
Kiran Kumar
Published By: 
Kiran Kumar
Request Count: 
16
Is Breaking News: 
No
Word Count: 
270