Shruti Haasan: ఫ్లాప్స్ లో ఉన్న వాళ్ళకి సూపర్ హిట్లు.. శృతిహాసన్ ప్రత్యేకత..

Salaar: సినీ తెరకు పరిచయమైంది కమలహాసన్ కూతురుగానే అయినా.. తన సొంత టాలెంట్ తో పైకి వచ్చిన నటి శృతిహాసన్. నటనతో పాటు సింగింగ్ లో కూడా ఆమె తన ప్రతిభను చాటింది.. అయితే మొదట్లో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు కాస్త గోల్డెన్ లెగ్ గా మారింది..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2023, 11:01 AM IST
Shruti Haasan: ఫ్లాప్స్ లో ఉన్న వాళ్ళకి సూపర్ హిట్లు.. శృతిహాసన్ ప్రత్యేకత..

Salaar Collections: కమల్ హాసన్ కూతురుగా అనగనగా ఒక ధీరుదు చిత్రంతో మనకు పరిచయమైన హీరోయిన్ శృతిహాసన్. అయితే ఈ సినిమా కన్నా ముందే కమల్ హాసన్ ఈనాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సింగర్ గా కూడా శృతిహాసన్ సుపరిచితురాలే… కానీ అనుకున్నంత ఈజీగా శృతిహాసన్ కి తెలుగులో స్టార్ డం రాలేదు. ఒకప్పుడు ఈ హీరోయిన్ ఏ సినిమా చేసిన ఫ్లాప్ అయ్యేది.

అప్పుడు ఎంతోమంది ఆమెను ఐరన్ లెగ్ గా ప్రకటించేశారు. అనగనగా ఓ ధీరుడు చిత్రంతో ప్రారంభమైన ఆమె ఫ్లాప్ లిస్ట్…ఓ మై ఫ్రెండ్.. రామయ్య వస్తావయ్య.. త్రీ.. సెవెంత్ సెన్స్ సినిమాలతో కొనసాగింది. ఈ చిత్రాలు అన్నీ పరవాలేదు అనిపించుకున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో అందరూ ఆమెను ఐరన్ లెగ్ అనడం ప్రారంభించారు. కానీ అప్పుడు శృతిహాసన్ జాతకాన్ని మార్చేసింది గబ్బర్ సింగ్. అయితే శృతిహాసన్ జాతకాన్ని ఆ సినిమా మార్చిందో ..లేదా శృతిహాసన్ ఫ్లాప్స్ లో ఉన్న హీరోలకి సూపర్ హిట్లు అందించడానికి వచ్చిందో అనేలా మారింది ప్రస్తుత కథ.

గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన శృతిహాసన్ అప్పటినుంచి అన్ని సూపర్ హిట్లు అందుకుంది. అయితే ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే.. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తెలుగు హీరోలు శృతిహాసన్ తో సినిమా చేస్తే చాలు అవి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

ముందుగా ఖుషి తర్వాత పది సంవత్సరాలు హిట్లు లేని పవన్ కళ్యాణ్ తో చేసి గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ చవి చూసింది ఈ హీరోయిన్.  ఆ తర్వాత కూడా ఫ్లాప్ ల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చింది. ఇక 2017లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా తరువాత ఒక హిట్టు కూడా లేని రవితేజకి కూడా ‘క్రాక్’ సినిమాతో శ్రుతి హిట్టుని అందించారు. రవితేజకి మాత్రమే కాదు ప్లాప్ ల్లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఈ చిత్రంతో మంచి కమ్‌బ్యాక్ వచ్చింది.

పవన్ కళ్యాణ్ కే కాకుండా చిరంజీవికి కూడా శృతిహాసన్ సూపర్ హిట్ అందించడం విశేషం. చిరంజీవి కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆయనకి కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచిన సినిమా వాల్తేరు వీరయ్య.  సైరా, ఆచార్య, గాడ్‌ఫాదర్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు అందుకున్న చిరంజీవికి శృతిహాసన్ హీరోయిన్ గా చేసిన ‘వాల్తేరు వీరయ్య’తో సూపర్ హిట్ అందించింది. 

ఇక తాజాగా బాహుబలి తరువాత ఒక్క హిట్ కూడా లేక బాధపడుతున్న ప్రభాస్‌కి.. ఆయన అభిమానులకు..ఈ ఏడాది సలార్ తో భారీ విజయం వచ్చింది. ఈ చిత్రంలో కూడా శ్రుతిహాసనే హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. మొత్తం పైన ఇలా వరస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరోలు అందరి కమ్‌బ్యాక్ లో శ్రుతిహాసన్ భాగమయ్యి వాళ్లకి లక్కీ హీరోయిన్ అయ్యిపోయారు.

Also Read: Rashmika Mandanna: త‌న‌ బాయ్​ఫ్రెండ్‌ ఎవరో చెప్పేసిన రష్మిక మందన్నా, వీడియో వైరల్

Also Read: Hardik Pandya: ఐపీఎల్ 2024కు హార్దిక్ పాండ్యా దూరం, తిరిగి కెప్టెన్సీ రోహిత్‌కేనా

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News