Waltair Veerayya Pre Release Event : వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు డుమ్మా.. చిరంజీవికి హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్.. కారణం అదేనట

Waltair Veerayya Pre Release Event చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు విశాఖలో నిర్వహించబోతోన్నారు. ఈక్రమంలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో శ్రుతి హాసన్ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2023, 02:38 PM IST
  • నేడే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఏయూ కాలేజ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు
  • చివరి నిమిషంలో శ్రుతి హాసన్ డుమ్మా
Waltair Veerayya Pre Release Event : వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు డుమ్మా.. చిరంజీవికి హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్.. కారణం అదేనట

Waltair Veerayya Pre Release Event శ్రుతి హాసన్‌కు ఆరోగ్యం బాగా లేదట. అందుకే వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు రాలేకపోతోన్నాను అంటూ బాధపడింది. ఈ మేరకు శ్రుతి హాసన్ తన ఇన్ స్టా స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ వేసింది. నా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇలా ఈవెంట్‌కు రాలేకపోతోన్నాను అని, అందుకు ఎంతో బాధగా ఉందంటూ శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. చిరంజీవి గారితో పని చేయడం నాకు ఆనందంగా ఉంది.. ఆయనతో పని చేయడం నాకు ఎంతో గర్వకారణం అంటూ శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.

వరుసగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఇలానే అనారోగ్యం బారినపడినట్టు తెలుస్తోంది. అయితే శ్రుతి హాసన్ నిన్న బాలయ్య ఈవెంట్‌లో సందడి చేసింది. బాలయ్య గురించి, వీర సింహా రెడ్డి గురించి, డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి ఎంతో గొప్పగా చెప్పింది. అయితే ఇప్పుడు ఇలా చిరంజీవి ఈవెంట్‌కు డుమ్మా కొట్టేస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతోన్నారు. 

శ్రుతి హాసన్ అసలే చిరంజీవి, వాల్తేరు వీరయ్య సినిమా విషయంలో ముందు నుంచి కాస్త నిరాసక్తిని చూపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. చిరంజీవి శ్రీదేవీ పాటకు అంతటి మంచులో డ్యాన్స్ చేయడం కాస్త కష్టంగా అనిపించిందంటూ, తనకేమీ అంతగా నచ్చలేదన్నట్టుగా శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.

ఇప్పుడు ఇలా ఆరోగ్యం బాగా లేదంటూ ఈవెంట్‌కు డుమ్మా కొట్టేయడంతో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. అయితే నిజంగానే శ్రుతి హాసన్ తనకు ఆరోగ్యం బాగా లేకనే ఇలా ఈవెంట్‌కు రాలేకపోతోందట. కానీ మెగా అభిమానులు మాత్రం ఇప్పుడు శ్రుతి హాసన్ చర్య మీద గరంగరం అవుతున్నారు. బాలయ్య ఈవెంట్‌కు వెళ్లింది కానీ మా చిరు ఈవెంట్‌కు రాదా? అంటూ శ్రుతి హాసన్ మీద మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News