Sreeleela Tension: కోట్లు పెట్టి తెచ్చుకుంటే నిర్మాతలకు తలనొప్పిగా మారిన శ్రీలీల

Sreeleela Problems for Tollywood producers:యంగ్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది, అయితే ఆమె నిర్మాతలకు తలనొప్పిగా మారిందని అంటున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 5, 2023, 09:58 PM IST
Sreeleela Tension: కోట్లు పెట్టి తెచ్చుకుంటే నిర్మాతలకు తలనొప్పిగా మారిన శ్రీలీల

Sreeleela Problems for producers: యంగ్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ భామ చేతిలో ప్రస్తుతానికి ఏడు సినిమాలు ఉన్నాయి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే చందాన ఈ భామ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులో పెళ్లి సందడి అనే సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయిన శ్రీ లీల తర్వాత ధమాకా అనే సినిమా కూడా చేసింది. రవితేజకు ఆమెకు వయసు వ్యత్యాసం చాలా ఉన్నా ఇద్దరికీ కెమిస్ట్రీ బాగా కుదరడంతో ఆ సినిమా కూడా హిట్ అయిపోయింది.

ఈ నేపథ్యంలో ఆమెకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.  ప్రస్తుతానికి ఆమె ఏడు సినిమాలను లైన్లో పెట్టింది. ఇవన్నీ ప్రస్తుతానికి షూటింగ్లో ఉన్న సినిమాలే. ఆమె మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. నందమూరి బాలకృష్ణ 108వ సినిమాలో ఆమె బాలకృష్ణ కుమార్తె పాత్రలో నటిస్తోంది. రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్టర్ గా తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. 

Also Read: Ugram Movie Review: 'ఉగ్రం' రివ్యూ అండ్ రేటింగ్.. అదరగొట్టిన అల్లరోడు!

ఇవి కాకుండా నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న అనగనగా ఒక రోజు సినిమా, విజయ్ దేవరకొండ 12వ సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా ఎంపికైంది. ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ 12వ సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ షూటింగ్ దశలో నుంచి రకరకాల దశల్లో ఉన్నాయి కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీ లీల డేట్స్ సెట్ చేసుకోవడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు.

పొరపాటున ఒకసారి ఇచ్చిన డేట్స్ మిస్ అయితే ఆమె డేట్స్ పట్టుకునేందుకు చాలా సమయం పడుతుందట. ఆమె చేస్తున్న సినిమాలన్నీ దాదాపు స్టార్ హీరోలతోనే చేస్తున్న నేపథ్యంలో హీరోతో కాంబినేషన్ సీన్స్ షూట్ చేయడానికి దర్శక నిర్మాతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇలా వరుస అవకాశాలు శ్రీ లీల దక్కించుకుంటూ ఉండటంతో రష్మిక మందన, పూజా హెగ్డే వంటి వారు పూర్తిగా బాలీవుడ్కే పరిమితమై అక్కడ ప్రాజెక్టులు సెట్ చేసుకునే పనిలో పడ్డారు.

 కేవలం రెండే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ లీల ఇలా ఏడు సినిమాలతో బిజీబిజీగా గడుపుతూ దర్శక నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తుంది అని అంటున్నారు. కావాలని ఆమె క్రేజ్ ప్రకారమే ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నా ఇప్పుడు డేట్స్ సర్దుబాటు చేయలేక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. మరి ఈ సినిమాలన్నీ ఆమెకు ఏ మాత్రం కలిసి వస్తాయో వేచి చూడాల్సి ఉంది.

Also Read: Naga chaitanya: సమంత చాలా మంచిది.. 'ఆమె'ను అగౌరవపరుస్తున్నారు.. నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News