టైటిల్ చెప్పేయండి.. ఛాన్స్ కొట్టేయండి!!

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ దక్షిణాన ఒక పేరులేని సినిమాలో ప్రధాన పాత్ర (హీరోయిన్ రోల్ అని వినికిడి)లో నటించనుంది. 

Last Updated : Dec 27, 2017, 07:08 PM IST
టైటిల్ చెప్పేయండి.. ఛాన్స్ కొట్టేయండి!!

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ దక్షిణాన ఒక పేరులేని సినిమాలో ప్రధాన పాత్ర (హీరోయిన్ రోల్ అని వినికిడి)లో నటించనుంది. ఇది ఒక చారిత్రక సినిమా(పీరియాడిక్ వార్ ఫిల్మ్). 

సన్నీ ఒక తెలుగు సినిమాలో డైరెక్ట్ గా హీరోయిన్ పాత్ర చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమాకు సన్నీ150 రోజులు కాల్షీట్స్ ఇచ్చింది. యుద్ధ విన్యాసాలు, గుర్రపుస్వారీ, కత్తి యుద్ధాలు నేర్పించడానికి చిత్ర యూనిట్ ఒక ట్రైనర్ ను ముంబైకు పంపించింది. ఈ చిత్రం ఒరిజినల్ షూటింగ్  ఫిబ్రవరిలో జరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం మరియు హిందీలలో విడుదల కానుంది మరియు త్వరలోనే ఈ చిత్రం పేరు వెల్లడి అవుతుందని ఈ నెల ప్రారంభంలోనే  తెలిపింది. 

వడి ఉదయన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. స్టీఫెన్ నిర్మాతగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ కాన్సెప్ట్ ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేసి అందరినీ సందిగ్ధంలో పడేసింది. సినిమాలోని ఆఖరి రెండక్షరాలను(తెలుగు) మాత్రమే చూపించి.. టైటిల్ ను కనిపెట్టాల్సిందిగా చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది. కరెక్ట్ గా ఊహించి చెప్పినవారికి సన్నీలియోన్ తో సెల్ఫీ దిగే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

Trending News