Mahesh Babu: కాలినడకన అలిపిరిలో మహేష్ బాబు ఫ్యామిలీ.. ఎంత సింపుల్ గా ఉన్నారో.. వీడియో వైరల్..

Mahesh babu family in Tirumala: మహేష్ బాబు సతీమణి, తన కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. దీంతో వారితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 14, 2024, 11:04 PM IST
  • అలిపిరిమెట్లమార్గంలో మహేష్ బాబు ఫ్యామిలీ..
  • ఫోటోలు దిగడానికి ఎగబడ్డ ఫ్యాన్స్..
Mahesh Babu: కాలినడకన అలిపిరిలో మహేష్ బాబు ఫ్యామిలీ.. ఎంత సింపుల్ గా ఉన్నారో.. వీడియో వైరల్..

Mahesh babu family in alipiri Tirumala: ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీ శ్రీవారి ఆలయంకు కాలినడకన చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం గుండా మహేష్ బాబు సతీమణి, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. నమ్రత, వారి ఫ్యామిలీని చూడగానే భక్తులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఎంతో సింపుల్ గా.. సామాన్య భక్తుల మాదిరిగానే నడుచుకుంటూ వచ్చారు. ఎలాంటి సెక్యురిటీ కానీ, హాడావిడి కానీ కన్పించలేదు. వీరితో సెల్ఫీలు దిగేందుకు అక్కడి భక్తులు పోటీ పడ్డారు.  అదే విధంగా నమ్రతా సైతం..  నవ్వుతూ.. తన పిల్లలతో స్వామి వారి దర్శనం చేసుకున్నారు.ఈ క్రమంలో వీరు తిరుమలకు వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

 

మరోవైపు ప్రిన్స్ మహేష్ బాబు.. గుంటూరు కారం హిట్ ఇచ్చిన రాజమౌళీతో మరోసినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం మహేష్ తన జుట్టును కూడా పెంచేసి కొత్త లుక్ లో అందర్ని అదరగొట్టారు. తొందరలోనేఈ మూవీ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.ఇక మహేష్ బాబు పుట్టిన రోజు నేపథ్యంలో రిరీలిజ్ అయిన మూవీ మురారీ థియేటర్లలో వసూళ్ల పర్వం కొనసాగిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలు నడుస్తున్న చాలాహళ్లలో హౌస్ ఫుల్ అనే బోర్డులు సైతం పెడుతున్నారంట. మరోవైపు ఈ సినిమాకు ఇప్పటికి కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని తెలుస్తోంది. సినిమా థియేటర్ లో కొంత మంది పెళ్లి చేసుకొవడం రచ్చగా మారింది.  దీనిపై మురారి దర్శకుడు కృష్ణవంశీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన  ఘట్టమని, ఇలాచేసుకునిమన ఆచారాలు, సంప్రదాయాల్ని తక్కువ చేసేలా ప్రవర్తించకూడదన్నారు.

Read more: Venu Swamy: ఆ ఒక్కరీజన్ తోనే సమంతను పక్కన పెట్టారు.. మరోసారి రెచ్చిపోయిన వేణు స్వామి..  

ఫ్యాన్స్ సినిమా హల్ కు రోజు రోజుకు పొటెత్తుతున్నారు. మరోవైపు ప్రిన్స్ మహేష్ బాబు చాలా సింపుల్ గా ఉంటారు. అదేవిధంగా ఆయన ఫ్యామిలీ కూడా ప్రస్తుతం ఎంతో సింపుల్ గా అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకోవడం పట్ల ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫ్యాన్స్ ఫోటోలో కోసం పోటీ పడుతున్న కూడా ఎక్కడ కూడా, చిరాకు పడకుండా.. నమ్రతా,తన పిల్లలతో కలిసి సరదాగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వీరు మెట్ల మార్గంగుండా తిరుమలకు చేరుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x