Tanishq Rajan కొందరు అనుకోకుండా సినిమా ప్రపంచంలోకి వచ్చి పడతారు.కొందరు ఇష్టంతోనే ఈ మహా సముద్రంలాంటి రంగుల ప్రపంచంలోకి దూకేస్తుంటారు. అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులభమమైన పని కాదు. సక్సెస్ రావడం కష్టమని అనుకుంటే.. వచ్చిన విజయాలను కాపాడుకోడం మరింత కష్టం. ఇలా ఎంతో మంది వస్తూనే ఉంటారు.. వెళ్తూనే ఉంటారు. ఇది మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో జరుగుతూ ఉంటుంది.
కానీ చిన్నతనంలోనే అంటే నాలుగేళ్ల ప్రాయంలోనే స్టేజ్ మీద నాటకాలు వేస్తూ తనిష్క్ రాజన్ ఈ సినిమా ప్రపంచం గురించి కలలు కన్నట్టుంది. పన్నెండేళ్ల వయసులో ముంబైకి వెళ్లడంతో సినిమా రంగంలోకి వచ్చేసిందట. మొదట్లో టీవీల్లో యాడ్స్‌లో నటించిందట. ఆ తరువాత తెలుగులోనే హీరోయిన్గా చాన్స్ దక్కించుకుందట. 2017లో శరణం గచ్చామి అనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా పర్వాలేదనిపించింది. అందులో ఆమె లుక్స్‌కు మంచి పేరు వచ్చింది. అందుకే వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే అవన్నీ కూడా చిన్న సినిమాలే. దేశంలో దొంగలు పడ్డారు, ఇష్టంగా, బైలంపూడి, కమిట్మెంట్ వంటి చిత్రాల్లో తనిష్క్ మెరిసింది. ఇక ఇప్పుడు నేనెవరు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. అయితే తాను ఇంకా చేయాల్సిందో ఎంతో ఉందని, తన ప్రయాణం ఇప్పుడే మొదలైనట్టుందని చెప్పుకొచ్చింది.
ఇక తాను ఎప్పుడూ దర్శకుడు ఏది చెబితే అది చేసే నటిని అంటూ తెలిపింది. ఎందుకంటే ఓ సినిమా ఎలా ఉండాలి?కారెక్టర్ ఎలా ఉండాలి? అనే విజన్ కేవలం దర్శకుడికే ఉంటుంది? అందుకే తాను దర్శకుడి చెప్పింది చేస్తాను అంటూ తనిష్క్ వెల్లడించింది. ఇంకా ఇంకా కష్టపడి ప్రేక్షకుల ప్రేమ సంపాదించుకుంటాను అని తనిష్క్ తన కోరికను బయటకు పెట్టేసింది.
Also Read : Samantha South Korea Treatment : సమంత పరిస్థితి విషమం.. చికిత్స కోసం దక్షిణి కొరియాకు?
Also Read : Vijay Devarakonda Liger : విజయ్ దేవరకొండను ప్రశ్నించిన ఈడీ.. వాటిపై కూపీ లాగే ప్రయత్నం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook