Tanushree Dutta: చంపాలని చూశారు.. రాష్ట్రపతి పాలన పెట్టండి.. తనుశ్రీ సంచలన ఆరోపణలు!

Tanushree Dutta Emotional Note Seeking Help: తనుశ్రీ దత్తా తాజాగా ఓ సుదీర్ఘమైన పోస్ట్ రాస్తూ తన బాధను వ్యక్తం చేసింది. 

Last Updated : Jul 20, 2022, 08:08 PM IST
Tanushree Dutta: చంపాలని చూశారు.. రాష్ట్రపతి పాలన పెట్టండి.. తనుశ్రీ సంచలన ఆరోపణలు!

Tanushree Dutta Emotional Note Seeking Help: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ నటీనటులపై గతంలో బహిరంగంగా మాట్లాడిన నటి తనుశ్రీ దత్తా తాజాగా ఓ సుదీర్ఘమైన పోస్ట్ రాస్తూ తన బాధను వ్యక్తం చేసింది. తనను బాలీవుడ్ మాఫియా వేధింపులకు గురిచేస్తోందని తనుశ్రీ దత్తా ఆరోపిస్తూ, తాను ఆత్మహత్య చేసుకోబోనని, ఊరు విడిచి వెళ్లనని కూడా చెప్పింది. తనుశ్రీ దత్తా తాను ఎరుపు రంగు దుస్తులు ధరించిన తన పాత ఫోటోను షేర్ చేస్తూ 'నన్ను తీవ్రంగా గాయపర్చారు, లక్ష్యంగా చేసుకున్నారు' అని అంటూ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసుకుంది. 

బాలీవుడ్‌లో గత ఏడాది తన పేరు నాశనమైందని, ఆ తర్వాత నా నీటిలో కొన్ని మందులు- స్టెరాయిడ్‌లను కలిపేందుకు ఒక పని మనిషిని పెట్టారని ఆమె వల్ల తనకు వివిధ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి అని ఆమె పేర్కొంది. నేను ఉజ్జయిని వెళ్ళినప్పుడు, నా కారు బ్రేకులు రెండుసార్లు పాడై నాకు ప్రమాదం జరిగిందని, తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డానని తనుశ్రీ దత్తా పేర్కొంది. తాను సాధారణ జీవితాన్ని గడపడానికి 40 రోజుల తర్వాత ముంబైకి తిరిగి వచ్చానని, కానీ ఇప్పుడు తన భవనంలోని నా ఫ్లాట్ బయట వింత అలాగే అసహ్యకరమైన విషయాలు జరుగుతున్నాయని అన్నారు. 

ఒక్క విషయం మాత్రం చెవులు విప్పి వినండి అందరూ, నేను ఆత్మహత్య చేసుకోను, అలాగే నేను ఇక్కడి నుండి పారిపోను, నేను ఇక్కడ నివసించడానికి వచ్చాను ఇప్పుడు నా కెరీర్‌ను గతంలో కంటే గొప్ప స్థానానికి తీసుకెళ్తానని ఆమె పేర్కొంది. బాలీవుడ్ మాఫియా, మహారాష్ట్రలోని పాత పొలిటికల్ సర్క్యూట్ కి ఇప్పటికీ ఇక్కడ ప్రభావం ఉందని పేర్కొంది. వారు మాత్రమే కాక నాసిరకం ఆలోచనలు కలిగిన జాతీయ వ్యతిరేక నేరస్థులు సాధారణంగా ప్రజలను వేధించడానికి ఇలా పని చేస్తారని ఆమె ఆరోపించింది.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన, సైనిక పాలన విధించాలని, గ్రౌండ్‌ లెవెల్‌ విషయాలపై కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి నియంత్రణ తీసుకోవాలని కోరుకుంటున్నానని ఆమె డిమాండ్ చేసింది. ఇక్కడ విషయాలు నిజంగా చేయి దాటిపోతున్నాయన్న ఆమె, నాలాంటి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ఇక్కడ కొన్ని పెద్ద అడుగులు వేయాలని ఆమె కోరింది. ఈ రోజు నేను చిక్కుల్లో ఉన్నాను, రేపు మీరు కూడా ఇదే పరిస్థితిలోకి రావచ్చని పేర్కొంది. 
Also Read: Vijay Devarakonda: ఇదేందయ్యా ఇదీ.. విజయ్ దేవరకొండ కటౌట్ ను ఆడుకుంటున్నారుగా!

Also Read: Bimbisara: టాప్ ప్రొడ్యూసర్ తో బింబిసార చూసిన ఎన్టీఆర్... కీలక నిర్ణయం!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News