Tarakaratna To Contest in Elections From TDP: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు సినీ పరిశ్రమలో కూడా నందమూరి వంశానికి ప్రత్యేక అధ్యాయం ఉందని చెప్పక తప్పదు. తొలత సినిమాల్లో రాణించిన నందమూరి తారక రామారావు తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలు నమోదు చేసి చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. ఇక ఆయన సినీ వారసులుగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న వంటి వారు సినిమాల్లో ఇప్పటికే రాణిస్తున్నారు.
రాజకీయ వారసులుగా బాలకృష్ణ ఒకపక్క ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక చంద్రబాబు సంగతి సరే సరి. ఇప్పుడు బాలకృష్ణతో పాటు వచ్చే ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయబోతున్నానని నందమూరి కుటుంబానికి చెందిన నటుడు, హీరో నందమూరి తారకరత్న ప్రకటించారు. గుంటూరు జిల్లా పెదనంది పాడు పాలపర్రులో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఆయన ఈ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత మూడేళ్లుగా సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని మరీ ముఖ్యంగా మాచర్లలో ఏం జరిగిందో అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి వచ్చే భావితరాల సుఖంగా బతకాలి అనుకుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును తిరిగి సీఎం చేసుకోవాలి అని కోరారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాను ఇప్పటి నుంచే అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని బాలకృష్ణ బాబాయ్ ఆశయాలకు అనుకూలంగా నడుచుకుంటానని పేర్కొన్నారు.
ఇక ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టైం వచ్చినప్పుడు తమ్ముడు ఎన్టీఆర్ కూడా వస్తాడని, ఎప్పుడు వస్తాడు అన్నది ఆయన నిర్ణయాన్ని బట్టి ఉంటుందని పేర్కొన్నారు. ఆ టైంలో ఆయన తప్పక వస్తాడని పేర్కొన్నారు. అయితే నందమూరి తారకరత్న ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఈ విషయం మీద క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది.
Also Read: Hunger Strike: టాలీవుడ్ నిర్మాతల నిరాహార దీక్ష.. అసలు ఏమైంది అంటే?
Also Read: Avatar 2 - Narappa: అవతార్ 2 మన నారప్పే.. చూసిన వాళ్ళందరూ ఎందుకలా అంటున్నారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.