/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Mirai : చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న తేజ సజ్జ ఇప్పుడు హీరోగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన తేజ జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మంచి హిట్ అందుకున్నాడు. 

ఇక ఈ మధ్యనే విడుదలైన హను మ్యాన్ సినిమాతో తేజ సజ్జ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో తేజ సజ్జ హీరోగా ఇండస్ట్రీలో బలమైన ముద్ర వేసుకున్నాడు అని చెప్పొచ్చు.

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు వంటి చాలామంది స్టార్ హీరోలతో ఒకప్పుడు స్క్రీన్ షేర్ చేసుకున్న తేజ ఇప్పుడు తనకంటూ ఒక మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. 300 కోట్లకు పైగా వసూలు చేసిన హనుమాన్ సినిమాతో ఇప్పుడు తేజ కెరియర్ పూర్తిగా మారిపోయింది.

తేజ తదుపరి సినిమా ఏమిటి అని అందరూ ఎదురు చూస్తుండగా ప్రస్తుతం తేజ మిరాయి అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈగల్ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మిరాయి అనేది ఒక జపనీస్ పదం. కాబట్టి ఈ సినిమా ఒక యాక్షన్ మూవీ అని వినికిడి.

మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అసలైతే ఈ సినిమాని ఒక మోస్తారు బడ్జెట్ తో తీయాలని ముందుగా అనుకున్నారట. కానీ హను మ్యాన్ సినిమాతో తేజ మార్కెట్ బాగా పెరగడం, ప్యాన్ ఇండియా స్థాయిలో అతనికి ఫాలోయింగ్ రావడంతో ఈ సినిమా బడ్జెట్ కూడా పెంచుతున్నట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 40 కోట్లకు పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అశోక వనంలో అర్జున కళ్యాణం ఫేమ్ హీరోయిన్ రితికా నాయక్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని దర్శక నిర్మాతలు లాంచ్ చేయనున్నారు. త్వరగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని వేసవి చివర్లో సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. అయితే హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించినప్పటికీ ఆ చిత్రం డైరెక్టర్ లేక కథ వల్ల విజయం సాధించిందని ఎవరిని అడిగినా చెబుతారు. తేజ నటన చాలా బాగున్న.. కేవలం హనుమాన్ లాంటి ఒక హిట్ మాత్రమే ఉన్న ఈ హీరోని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడం.. కరెక్టేనా అని ఎంతోమంది సందేహ పడుతున్నారు. 

ఈ క్రమంలో మిరాయి సినిమా కథ కూడా.. కొంచెం వైవిధ్యంగా ఉండబోతుందని.. అందుకే ఇంత బడ్జెట్ పెట్టి తీస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా కూడా సూపర్ హిట్ సాధిస్తే తేజ తప్పకుండా టైర్ 2 హీరోస్ లిస్టు లోకి తన మఖం మార్చడం ఖాయం.

Also Read: YS Jagan: మళ్లీ ముఖ్యమంత్రి అవుతా.. వలంటీర్‌ వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తా: వైఎస్‌ జగన్‌

Also Read: Amanchi Krishna Mohan: వైఎస్ జగన్‌కు భారీ షాక్‌.. వైసీపీకి ఆమంచి కృష్ణ మోహన్‌ రాజీనామా

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Teja Sajja signs his first high budget movie Mirai vn
News Source: 
Home Title: 

Teja Sajja: చిన్న హీరోని నమ్మి భారీ రెమ్యూనరేషన్.. తేజ సజ్జ కి ఇది సాధ్యమా?

Teja Sajja: చిన్న హీరోని నమ్మి భారీ రెమ్యూనరేషన్.. తేజ సజ్జ కి ఇది సాధ్యమా?
Caption: 
Teja Sajja Mirai (source:FILE)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Teja Sajja: చిన్న హీరోని నమ్మి భారీ రెమ్యూనరేషన్.. తేజ సజ్జ కి ఇది సాధ్యమా?
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, April 5, 2024 - 11:50
Created By: 
Vishnupriya Chowdhary
Updated By: 
Vishnupriya Chowdhary
Published By: 
Vishnupriya Chowdhary
Request Count: 
31
Is Breaking News: 
No
Word Count: 
365