Cinema Ticket Price: తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంపు- కొత్త ధరలు ఇవే..!

Cinema Ticket Price: తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి లభించింది. సినీ నిర్మాతలు, థియేటర్ల యజమానులు చేసిన వినతికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పెంచిన టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 09:31 AM IST
  • టాలీవుడ్​కు తెలంగాణ ప్రభుత్వం గుడ్​ న్యూస్​
  • సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి
  • ఏపీలో కొనసాగుతున్న టికెట్​ ధరల వివాదం
Cinema Ticket Price: తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంపు- కొత్త ధరలు ఇవే..!

Cinema Ticket Price: సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు (Cinema Ticket Price rise in Telangana) అనుమతినిచ్చింది. సినీ నిర్మాతల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ధరల పెంపుపై అధికారులు పంపిన ప్రతిపాదనలను సైతం తెలంగాణ ప్రభుత్వం అమోదించింది.

ఈ ప్రతిపాదనలో నగరాల్లో టికెట్​ ధరలు ఎంత ఉండాలి? పట్టణాల్లో ఎంత ఉండాలి? టౌన్లలో ఎంత ఉండాలి? అనేది నిర్ణయించారు. దీనితో పాటు ఏసీ థియేటర్లలో ధరలు ఎలా ఉండాలి? మల్టీ ప్లెక్స్​లలో ధరలు ఎలా ఉండాలి? అనేది కూడా ఖరారు (Telangana Cinema Ticket prices) చేశారు.

కొత్త ధరలు ఇలా(Telangana new Cinema Ticket prices)..

నాన్​ ఏసీ థియేటర్లలో టికెట్ ధర కనీసం రూ.30కి పెంచగా.. గరిష్ఠ ధర రూ.70గా నిర్ణయించారు.

ఏసీ థియేటర్లలో కనీస టికెట్ ధర రూ.50గా ఉంచగా.. గరిష్ఠ టికెట్ ధర రూ.150కి పెంచారు. జీఎస్​టీ కూడా వర్తిస్తుంది.

మల్టీప్లెక్స్​లో టికెట్ ధర కనీసం రూ.100గా ఫిక్స్ చేశారు. గరిష్ఠ ధర రూ.250గా ఉంచారు. దీనికి జీఎస్​టీ అదనంగా వసూలు చేయొచ్చు.

ఇక రిక్లైనర్​ సీట్ల ధరలను సింగిల్​ థియేటర్లలో అయితే.. రూ.200లకు, మల్టీ ప్లేక్స్​లో అయితే రూ.300కు పెంచారు. దీనికి జీఎస్​టీ అదనం.

వీటితో పాటు నిర్వహణ ఛార్జీల కింద నాన్​ ఎసీ థియేటర్లు రూ.3, ఏసీ థియేటర్లు రూ.5 వసూలు చేసుకునేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.

ఏపీలో టికెట్ ధరల వివాదం..

ఆంధ్రప్రదేశ్​లో మాత్రం టికెట్ ధరల అంశంపై తీవ్రంగా చర్చ (AP Cinema Ticket Prices Issue) సాగుతోంది. సినీ పరిశ్రమ వర్సెస్​ ఏపీ ప్రభుత్వం అనే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. సినిమా టికెట్ ధరల తగ్గింపును తప్పుబడుతూ హీరో నాని (Actor Nani) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే లేపాయి.

ఇదిలా ఉండగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా హాళ్లు మూసేయడం వంటి చర్యలకు దిగుతున్నారు.

ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైన విషయం తెలిసిందే. దీనిపై జనవరి 4న తుది తీర్పు వెలువరించనుంది హైకోర్టు. ఆ తర్వాతే ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది.

ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం.. ఏపీలో సినిమా టికెట్ ధరలు ప్రస్తుతం రూ.5 నుంచి రూ.250 వరకు ఉన్నాయి.

Also read: Unstoppable With NBK: పుష్పరాజ్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య- 'తగ్గేదేలే' అంటున్న బన్నీ

Also read: RRR Copy Scenes: ఏంటి..ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ "గూస్‌బంప్స్" సీన్స్ హాలీవుడ్‌ కాపీ నా..? మీరే చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News