Tenent: వెరైటీ కాన్సెప్ట్‌తో సత్యం రాజేష్ ముఖ్యపాత్రలో వస్తోన్న 'టెనెంట్' మూవీ.. ఏప్రిల్ మూడో వారంలో విడుదల..

Tenent: సత్యం రాజేష్ ఈ మధ్యకాలంలో లీడ్ రోల్లో అలరిస్తున్నాడు. గతేడాది 'పొలిమేర 2' మూవీతో అలరించిన ఈయన తాజాగా 'టెనెంట్' మూవీతో పలకరించబోతున్నాడు. తెలుగులో వస్తోన్న రెగ్యులర్ మూవీస్‌లా కాకుండా వెరైటీ కాన్సెప్ట్‌తో వస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 19, 2024, 09:43 PM IST
Tenent: వెరైటీ కాన్సెప్ట్‌తో సత్యం రాజేష్ ముఖ్యపాత్రలో వస్తోన్న 'టెనెంట్' మూవీ.. ఏప్రిల్ మూడో వారంలో విడుదల..

Tenent: సత్యం రాజేష్ (Satyam Rajesh) ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. హీరోగా నటిస్తూ అలరిస్తున్నారు. ఈయన ముఖ్యపాత్రలో వై.యుగంధర్ దర్శకత్వంలో (Y.Yugandhar) మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి (Mogulla Chandra Shekhar Reddy) మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్. రవీందర్ రెడ్డి (N. Ravinder Reddy) సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సమాజంలో లేడీస్ ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసేలా చాలా విలువైన కంటెంట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు ఈ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో  ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ మూడో వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సత్యం రాజేష్ విషయానికొస్తే.. దివంగత దర్శకుడు సూర్య కిరణ్ దర్శకత్వంలో సుమంత్ హీరోగా నటించిన 'సత్యం' మూవీతో కమెడియన్‌గా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆపై హీరోగా సత్తా చూపెట్టాడు. మొత్తంగా ఈ సారి 'టెనెంట్‌' మూవీతో పలకరించబోతున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.

మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు. జెమిన్ జోమ్ అయ్యనేత్ డీవోపీ కాగా విజయ్ ముక్తవరపు ఎడిటర్. నటీనటులు: సత్యం రాజేష్ , మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ , తేజ్ దిలీప్, ఆడుకలం నరేన్, ఎస్తెర్ నొరోన్హ, ధనా బాల, చందు , అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న

స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & దర్శకత్వం: వై. యుగంధర్,నిర్మాత: మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, సహ నిర్మాత : రవీందర్ రెడ్డి .ఎన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రసూన మండవ,సంగీతం : సాహిత్య సాగర్,డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జెమిన్ జోమ్ అయ్యనేత్, ఎడిటర్: విజయ్ ముక్తవరపు,కథ: యస్ శ్రీనివాస వర్మ.

Also Read: TamiliSai: "బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు": రాజ్‌భవన్‌ ఖాళీ చేసిన తమిళిసై

Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News