The Kerala Story: మీ దగ్గరలో ఉన్న 'ది కేరళ స్టోరీ' థియేటర్స్ లిస్టు తెలుసుకోండిలా!

The Kerala Story Nearby Theatres List : ఒక ముగ్గురు యువతులను మతం మార్చి ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థ కోసం పని చేసేందుకు ఎలా దేశాలు దాటించారు అనే కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ది కేరళ స్టోరీ మీ దగ్గరలో ఎక్కడ ఆడుతుందో తెలుసుకుందాం పదండి. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 9, 2023, 07:15 PM IST
The Kerala Story: మీ దగ్గరలో ఉన్న 'ది కేరళ స్టోరీ' థియేటర్స్ లిస్టు తెలుసుకోండిలా!

The Kerala Story Nearby Theatres: ఆదాశర్మ, సిద్ధి ఇద్నాని, సోనియా బలాని వంటి వారు కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం ది కేరళ స్టోరీ. ఒక ముగ్గురు యువతులను మతం మార్చి ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థ కోసం పని చేసేందుకు ఎలా దేశాలు దాటించారు అనే కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని సుదీప్తో సేన్ స్వయంగా రీసెర్చ్ చేసి రచించి డైరెక్ట్ చేశారు. విపుల్ అమృతలాల్ షా నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

ఇక ఈ సినిమా ప్రస్తుతానికి హైదరాబాదులో కూడా థియేటర్లలో ప్రదర్శితం అవుతుంది. ఒక్కొక్క మల్టీప్లెక్స్ లో ఐదారు షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా వివాదాలకు కారణమైన నేపథ్యంలో ముందుగా హైదరాబాద్ పోలీసులు ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద భద్రత కూడా పెంచారు. కానీ తర్వాత తరువాత ఈ సినిమాలో అంత వివాదాస్పద అంశాలు లేవని భావించి ఆ భద్రతను తగ్గించారు.

Also Read: Sonia Balani: 'ది కేరళ స్టోరీ'లో ముస్లిం అమ్మాయిగా నటించిన సోనియా బలానీ మోడ్రన్ డ్రెస్సుల్లో అదిరిపోయింది చూశారా?

ఇక ఈ సినిమా ఏ ఏ థియేటర్లలో హైదరాబాదులో అందుబాటులో ఉంది అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా పంజాగుట్ట పివిఆర్ మాల్ లో, జీవీకే వన్ ఐనాక్స్ మాల్ లో, ఎర్రమంజిల్ పివిఆర్ మాల్ లో, ప్రసాద్ ఐమాక్స్ లో, సికింద్రాబాద్లోని టివోలీ సినిమా థియేటర్స్ లో, ఇనార్బిట్ మాల్ పివిఆర్ థియేటర్లో, ముక్తా ఏ2 సినిమాస్ థియేటర్లో, ఏషియన్ తారకరామా సినీ ఫ్లెక్స్ లో, కాచిగూడ ఐనాక్స్ మాల్ లో, ఏషియన్ సినిమాస్ ఎం క్యూబ్ మాల్ అత్తాపూర్ రింగ్ రోడ్ లో, పివిఆర్ నేక్సెస్ మాల్ కూకట్పల్లిలో, ప్లాటినం సినిమాస్ గచ్చిబౌలిలో, ఏఎంబి సినిమాస్ గచ్చిబౌలిలో, శ్రీ లక్ష్మీ కళామందిర్ థియేటర్ మూసాపేట్ లో ప్రస్తుతానికి ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాకి ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్న నేపథ్యంలో థియేటర్ల సంఖ్య అలాగే షోస్ సంఖ్య కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు సినిమాకి వెళ్లాలనుకుంటున్న రోజు దగ్గరలో ఉన్న థియేటర్ బుక్ చేసుకుని వెళ్ళగలరు. 

Also Read: The Kerala Story tax free: ఆ రాష్ట్రాల్లో టాక్స్ ఫ్రీగా 'ది కేరళ స్టోరీ'..టికెట్లు ఎంత తక్కువకి దొరుకుతాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News