Sudheer Varma Death: టాలీవుడ్‌లో విషాదం.. యువ నటుడి ఆత్మహత్య

Sudheer Varma Death: టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. కుందనపు బొమ్మ సినిమాలో హీరోగా నటించిన సుధీర్ వర్మ వ్యక్తిగత సమస్యలతోనే సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2023, 11:44 AM IST
  • టాలీవుడ్‌లో నెలకొన్న విషాదం
  • ఆత్మహత్య చేసుకున్న యువ నటుడు
  • షూట్ అవుట్ ఆలేరుతో ఫేమస్
Sudheer Varma Death: టాలీవుడ్‌లో విషాదం.. యువ నటుడి ఆత్మహత్య

Tollywood Young Actor Sudheer Varma Death: టాలీవుడ్‌లో వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది సీనియర్ నటీనటులు మరణించారు. ఇప్పుడు యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుధీర్ వర్మ సూసైడ్ చేసుకున్నారు. కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూట్ అవుట్ ఏ అలేరు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతూనే ఇలా వైజాగ్‌లోని తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం.

సుధీర్ వర్మ మరణం పట్ల నటుడు సుధాకర్ ఎమోషనల్ అయ్యాడు. సుధీర్ ఎంతో మంచి వాడు.. అతనితో కలిసి పని చేసే అదృష్టం నాకు దక్కింది.. అతనితో పని చేయడం వల్ల ఆయన మంచితనం నాకు తెలిసిందే.. ఆయన మరణించాడనే వార్తను నేను తట్టుకోలేకపోతోన్నాను..  జీర్ణించుకోలేకపోతోన్నాను.. ఓం శాంతి..  అంటూ సుధాకర్ ఎమోషనల్ అయ్యాడు.

అయితే సుధీర్ వర్మతో కలిసి నటించిన చాందినీ చౌదరి అయితే ఇంకా స్పందించలేదు. సుధీర్ లేనడే వార్త, సూసైడ్ చేసుకున్నాడనే విషయం ఆమెకు ఇంకా తెలియనట్టుంది. ఇక షూట్ అవుట్ ఆలేరు అనే వెబ్ సిరీస్‌ను సుష్మిత కొణిదెల నిర్మించిన విషయం తెలిసిందే.

Also Read:  Honey Rose Drinking : బాలయ్యతో కలిసి మందు కొడుతోందిగా.. హనీ రోజ్ యవ్వారం మామూలుగా లేదే

Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News