Tollywood upcoming movies: కమర్షియల్ సినిమాలను కూడా ఏళ్ళు తరబడి తీస్తున్న హీరోలు..!

Tollywood movies:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలకు కొదవలేదు. స్టార్ హీరోలు ఎక్కువగా కమర్షియల్ సినిమాలతో భారీ సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుతం.. ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులకు కమర్షియల్ సినిమాలంటేనే ఆసక్తి లేకుండా పోతుంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 22, 2024, 10:22 PM IST
Tollywood upcoming movies: కమర్షియల్ సినిమాలను కూడా ఏళ్ళు తరబడి తీస్తున్న హీరోలు..!

Pushpa 2: టాలీవుడ్ స్టార్ హీరోలకు.. కమర్షియల్ సినిమాలకి ఉన్న అవినాభాగ సంబంధం ఈనాటిది కాదు. తెలుగులో ఇప్పటికీ చాలావరకు కమర్షియల్ సినిమాలు తీయడానికి డైరెక్టర్లతో పాటు హీరోలు కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ ను టార్గెట్ చేసి విడుదల చేసే ఈ కమర్షియల్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ కూడా భారీగానే ఉంటుంది. కానీ కాలం గడుస్తున్న కొద్ది కమర్షియల్ చిత్రాల ఆదరణ తగ్గిపోయేలా కనిపిస్తోంది. 

గతంలో కృష్ణ ,ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్ లాంటి హీరోలు సంవత్సరానికి 7నుంచి 8 సినిమాలు వరకు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు కూడా అప్పట్లో సంవత్సరానికి 4,5 సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేవాళ్ళు. అలాంటిది టాలీవుడ్ లో స్టార్ హీరోల నుంచి ఇప్పుడు సంవత్సరానికి.. ఒక్క సినిమా రావడం కష్టమైపోతుంది.

స్టార్ హీరో సినిమా అంటే.. కనీసం షూటింగ్ కి సంవత్సరానికి పైనే పడుతుంది. భారీ బడ్జెట్ తో తీసే సినిమాలు కాబట్టి చిత్రీకరణకు తీసుకునే సమయం కూడా భారీగానే ఉంటుంది. చిత్ర బంధం నుంచి అప్డేట్స్ కూడా సరిగ్గా రావడం లేదు. కొన్ని సినిమాలకు.. విడుదల తేదీ వరుసగా వాయిదాలు పడుతూనే ఉంది. మరోపక్క మలయాళం చిత్రాలు తెలుగులో విపరీతమైన ఆదరణ అందుకుంటున్నాయి. సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన డబింగ్ చిత్రాలు కూడా భారీ విజయాన్ని సాధిస్తున్నాయి. 

టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఒక్క సినిమా తీయడానికి కొన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నాలుగు సంవత్సరాల క్రితం నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఇప్పటివరకు మరే చిత్రాన్ని విడుదల చేయలేదు.ఈ నేపథ్యంలో.. తమ ఫేవరెట్ స్టార్ హీరో సినిమాలు రాకపోవడంతో అభిమానులు బాగా నిరాశ చెందుతున్నారు. పైగా ఇప్పుడు చాలా సినిమాలు రెండు భాగాలుగా తీస్తున్నారు..దీంతో ఒక సినిమా పూర్తి అవడానికి కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు పడుతోంది.

ఉదాహరణకి పుష్ప సినిమా తీసుకుంటే.. పుష్ప: ది రైజ్ మూవీ 2001లో విడుదలైంది. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో మూవీ సీక్వల్ పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. 2024 పూర్తి కావస్తున్నప్పటికీ ఇంకా పుష్పా రెండవ భాగం విడుదల కాలేదు. నిజానికి ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కావలసి ఉంది. కానీ ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండడంతో డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ రిలీజ్ డేట్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. సినిమా చిత్రీకరణకు తీసుకునే టైం లో మార్పు రాకపోతే టాలీవుడ్ లో కమర్షియల్ చిత్రాలకు ఆదరణ బాగా తగ్గిపోయే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: పుట్టినరోజున సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి..

ఇదీ చదవండి: ఏపీలో ఘోర విషాదం.. 18కి చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News