Ravi Teja's Tiger Nageswara Rao : డిఫరెంట్ బయోపిక్‌తో వస్తోన్న రవితేజ

Ravi Teja Tiger Nageswara Rao biopic : వెంటవెంటనే సినిమాలు చేయడంలో అందరి హీరోల కంటే ముందంజలో ఉన్నాడు. తాజాగా రవితేజ అప్‌కమింగ్ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 01:50 PM IST
  • మంచి జోరు మీద ఉన్న మాస్ మహారాజ్ రవితేజ
  • కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న రవితేజ
  • వంశీ దర్శకత్వంలో రవితేజ నటించనున్న కొత్త చిత్రం టైగర్‌
  • తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా
Ravi Teja's Tiger Nageswara Rao : డిఫరెంట్ బయోపిక్‌తో వస్తోన్న రవితేజ

Tollywood hero mass maharaj raviteja 70th film announcement Ravi Teja To Star In A Pan India Film Check Out The Tiger Nageswara Rao First Poster: మాస్ మహారాజ్ రవితేజ మంచి జోరు మీద ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అలాగే కథల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రవితేజ (raviteja). వెంటవెంటనే సినిమాలు చేయడంలో అందరి హీరోల కంటే ముందంజలో ఉన్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను లైన్‌లో పెట్టిన రవితేజ.. మరో రెండు సినిమాలకు సైన్ చేశాడు. పైగా ఆ సినిమాల నుండి వెంటవెంటనే అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్‌ను కూడా హ్యాపీ చేస్తున్నాడు మాస్ మహారాజ్ (mass maharaj). తాజాగా రవితేజ (raviteja) అప్‌కమింగ్ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. వంశీ దర్శకత్వంలో రవితేజ నటించనున్న కొత్త చిత్రం పేరు ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Also Read : Viral Video : ఎగసిపడిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం.. పిల్లలను ఓ కంట కనిపెట్టండి!

అక్కడ దొంగలు.. దోపిడీదారులు ఉండేవారు.. అదే విధంగా టైగర్‌ నాగేశ్వరరావు కూడా అంటూ మూవీ యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్టువర్టుపురం (Stuartpuram) దొంగల ముఠాలో నాగేశ్వరరావు ఒకడు. అతని తెగింపునకు గుర్తుగా టైగర్‌ పేరుతో పిలిచేవారు. 

 

అయితే టైగర్‌ నాగేశ్వరరావు జీవితం గురించి గతంలో ఓసారి దర్శకుడు వంశీ (Director Vamsi) ఈ విధంగా మాట్లాడారు. నాగేశ్వరరావు కేవలం దొంగగా మాత్రమే చాలా మందికి తెలుసు అన్నారు. ఆయన జీవితంలో అంతకుమించిన కోణాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. అతడిది రాబిన్‌హుడ్‌ తరహా జీవితమని.. దోచుకొచ్చిన సొత్తును పేదలకు దానం చేసేవాడని చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీని అభిషేక్‌ అగర్వాల్‌ (Abhishek Agarwal) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి టైగర్‌ నాగేశ్వరరావు రవితేజ (Ravi Teja) సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని కూడా మూవీ యూనిట్ త్వరలో వెల్లడించనుంది.

Also Read : Bheemla Nayak Update: గెట్ రెడీ ఫర్ దీపావళి ట్రీట్.. సాయంత్రం 'లాలా భీమ్లా' ప్రోమో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News