Tollywood Hero Nandamuri Balakrishna discharged after surgery : టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఆస్పత్రిలో చేరారు. బాలకృష్ణకు కుడి భుజం నొప్పి తీవ్రం కావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆస్పత్రి వైద్యుల బృందం బాలకృష్ణకు సుమారు 4 గంటల పాటు సర్జరీ చేసింది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం బాలకృష్ణ (Balakrishna) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
కాగా గత ఆరు నెలలుగా బాలకృష్ణ భుజం నొప్పితో బాధపడుతున్నారు. దీంతో తాజాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ (Akhanda) మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు.
Also Read : Huzurabad By Election Result Live Counting: ఈటెల రాజేందరే హుజురా 'బాద్షా'..ఉపఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
దీని తర్వాత గోపిచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. మరోవైపు ప్రముఖ ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్స్’ (Unstoppable) పేరుతో సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు బాలయ్య. అయితే బాలకృష్ణకు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారని తెలుస్తోంది.
Also Read : Paddy seeds sale విషయంలో సిద్ధిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై TS High court ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook