Jayasudha's Shocking Look: జయసుధ ఇంతలా మారిపోయిందేంటి! చూస్తే షాక్ అవ్వాల్సిందే!!

సీనియర్ నటి జయసుధ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా.. చికిత్స కోసం అమెరికా వెళ్లారు.. ఆయితే ఈ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2021, 08:31 AM IST
  • 45 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న జయసుధ
  • అనారోగ్యం కారణంగా చికిత్స కోసం అమెరికా వెళ్లిన నటి
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోతో షాక్ అయిన అభిమానులు
Jayasudha's Shocking Look: జయసుధ ఇంతలా మారిపోయిందేంటి! చూస్తే షాక్ అవ్వాల్సిందే!!

Jayasudha's Shocking Look Goes Viral: జయసుధ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా.. ఇప్పుడు తల్లి పాత్రలో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానంను సంపాదించారు. 45 ఏళ్లకు పైగా సినీ కెరీర్ కొనసాగిస్తున్న జయసుధ.. భిన్న రకాల పాత్రలు పోషించి 'స‌హ‌జ‌న‌టి' అని పేరు తెచుకున్నారు.

అంతేకాదు తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్న జయసుధ.. ఇటీవలి కాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు. 'మహర్షి', 'రూలర్‌' సినిమాల తర్వాత ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. అందుకు కారణం కారణం లేకపోలేదు. అనారోగ్యంతో సహ‌జ‌న‌టి అమెరికాలో ఉంటున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read: Siva Shankar master health condition: శివ శంకర్ మాస్టర్‌కి సోను సూద్ సహాయం

గత కొంతకాలంగా జయసుధ ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స కోసం అమెరికాకు వెళ్లినట్లు సమాచారం తెలుస్తోంది. తాజాగా ఆమె తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ ఫొటో చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. 'స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ' అంటూ జయసుధ తన ట్విట్టర్ పోస్ట్ చేసింది. టీ షర్ట్, క్యాప్ పెట్టుకుని సెల్ఫీ దిగారు. ఎంతో బొద్దుగా ఉండే జయసుధ.. తాజా ఫొటోలో మాత్రం మరీ సన్నగా మారిపోయారు.

ముఖ్యంగా ఆమె మొహం పూర్తిగా మారిపోయింది. ఎంతో అందంగా ఉండే జయసుధ మొహం ఇప్పుడు చూడడానికి అస్సలు బాలేదు. ఈ పిక్ చూసి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అసలు జయసుధకు ఏమైంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

స‌హ‌జ‌న‌టిగా గుర్తింపు పొందిన జయసుధ అసలు పేరు సుజాత అన్న విషయం తెలిసిందే. సినిమాల్లోకి వచ్చాక ఆమె జయసుధగా పేరు మార్చుకున్నారు. ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు వంటి అప్పటి స్టార్ హీరోలతో ఆమె నటించారు. శ్రీదేవి, రాధిక, జయప్రద, విజయశాంతి, సుహాసిని లాంటి స్టార్ హీరోయిన్‌లతో పోటీపడి తెలుగు ఇండస్ట్రీని ఏలారు. హోమ్లీ హీరోయిన్‌గానే కాకుండా బికినీ కూడా వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఆమె రాయించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి కొన్ని రోజులు ప్రజాసేవ చేశారు. 

Also Read: Urfi Javed in transparent top: ట్రాన్స్‌పరెంట్ టాప్‌లో ఉర్ఫి జావేద్.. ట్రోల్స్‌కి జావేద్ సమాధానం

ఇక భర్త నితిన్‌ కపూర్‌ 2017లో మరణించిన తర్వాత జయసుధ చాలా వరకు సినిమాలు తగ్గించారు. ప్రస్తుతం జయసుధ తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. జయసుధ పెద్ద కుమారుడు నిహార్ కపూర్ వివాహం గతేడాది వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' అనే సినిమాలో నిహార్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక త్వరలో జయసుధ హైదరాబాద్ తిరిగి రాబోతున్నారని సమాచారం తెలుస్తోంది. ఆరోగ్యం కుదుటపడ్డాక ఆమె సినిమాల్లో నటిస్తారని తెలుస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News