RRR Glims: సెలబ్రెటీలు సైతం ఫిదా.. మోగిపోతున్న ట్విట్టర్

'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్స్ ప్రారంభమయ్యాయి.. ఈ రోజు విడుదలైన 'గ్లింప్స్‌' ఆకట్టుకోగా.. సెలబ్రెటీలు సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2021, 07:33 PM IST
  • రికార్డ్స్ కొల్లగొడుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' గ్లింప్స్‌
  • గ్లింప్స్‌ పై స్పందిస్తున్న సెలబ్రెటీలు
  • విజువల్ వండర్ కోసం సెలబ్రెటీలు సైతం వెయిటింగ్
RRR Glims: సెలబ్రెటీలు సైతం ఫిదా.. మోగిపోతున్న ట్విట్టర్

 Tollywood Stars Response on RRR Glims: రాజమౌళి (Rajamouli).. అదొక సంచలనం.. తెలుగు చలన చిత్ర సీమను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్.. తన సినిమాలని ఎలా తీయాలి, జనాల్లో ఎలా పబ్లిసిటీ చేయాలో పక్క ప్రణాళిక తెలిసిన దర్శకుడు రాజమౌళి. సోమవారం విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR)సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.. కేవలం 45 సెకన్లలో సినిమా ఎలా ఉండబోతుందో.. ఏ రేంజ్ లో విజవల్ వండర్ గా నిలవనుందో ప్రేక్షకులకు పరిచయం చేసాడు.. 

మాములుగా సినిమా అప్డేట్ వచ్చిందటే... ఆ సినిమా హీరో అభిమానులు మాత్రమే సాధారణంగా రియాక్ట్ అవుతుంటారు, కానీ ఈ రోజు విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్‌' గ్లింప్స్‌ (RRR Glims) చూసి సెలబ్రెటీలు సైతం తమ స్పందనను ట్విట్టర్ లో పంచుకున్నారంటే.. అది మన దర్శక ధీరుడు జక్కన్న పని తనం.. మహేష్ బాబు, అల్లుఅర్జున్, రానా, మరియు హీరో నాని వంటి హీరోలు సైతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' గ్లింప్స్‌ చూసి వారి అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 

Also read: Viral Video: ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకోండ్రా.. ఆవు నేర్పిన పాఠం.. వాడికి మాత్రం గుణపాఠం!

"అద్భుతమైన విజువల్స్ చూసి అబ్బురపరిచారు! జస్ట్ వావ్.. స్టన్నింగ్!! #RRR సినిమా చూడటానికి వేచి ఉండలేను" అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ట్వీట్ చేశారు. 

"మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్‌ రాజమౌళి గారు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు మీరు ఒక గర్వకారణం.. నా సోదరుడు రామ్ చరణ్, నా బావ..తారక్ పవర్ ప్యాక్ షో..  అజయ్‌, ఆలియా మరియు ఇతర చిత్ర బృందానికి హృదయ పూర్వక అభినందనలు" అంటూ అల్లు అర్జున్ (Allu Arjun) ట్వీట్ చేసాడు.. 

"రాజమౌళి సార్... 45 సెకన్లలో మీకెలా ఇది సాధ్యం సార్" అంటి హీరో నాని (Hero Nani) ట్వీట్ చేశారు. "మెగా మాస్ మ్యాజిక్   ఇలాంటి అవుట్‌స్టాండింగ్‌ థింగ్స్‌ లైఫ్ లో చూసి ఉండము" అంటూ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) కామెంట్ చేసాడు. 

Also read: Bigg Boss Nominations: రసవత్తరంగా నామినేషన్ ప్రక్రియ.. హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్

స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజుగా రామ్​చరణ్ (Ram Charan), కొమరం భీమ్ ఎన్టీఆర్​ (NTR) నటించారు. అలియా భట్ (Alia Bhutt), ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవ్​గణ్ (Ajay Devagan), శ్రియ, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించగా, డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు. రూ.450 కోట్లతో  నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్లలోకి (RRR Movie Release Date) రానుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News