Mahesh Babu New Look: అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో సూపర్ స్టార్, మహేష్ బాబు న్యూ లుక్ ట్రెండింగ్

Mahesh Babu New Look Viral: అత్యధిక పారితోషకం అందుకునే నటులలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా హవెల్స్ యాడ్ షూటింగ్ చేశారు ప్రిన్స్ మహేష్ బాబు. ఆ సందర్భంగా బయటకు వచ్చిన ఫొటోలు ట్రెండింగ్ అవుతున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 17, 2021, 12:25 PM IST
  • టాలీవుడ్ సూపర్ స్టార్ వరుస షూటింగ్స్‌తో బిజీబిజీగా గడుపుతున్నారు
  • తాజాగా హవెల్స్ యాడ్ షూటింగ్ చేశారు ప్రిన్స్ మహేష్ బాబు
  • మహేష్ బాబు లేటెస్ట్ లుక్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్
Mahesh Babu New Look: అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో సూపర్ స్టార్, మహేష్ బాబు న్యూ లుక్ ట్రెండింగ్

Mahesh Babu New Look Viral For Havells Commercial Shoot: టాలీవుడ్ సూపర్ స్టార్ వరుస షూటింగ్స్‌తో బిజీబిజీగా గడుపుతున్నారు. షూటింగ్ విరామాలలో కుటుంబంంతో సరదాగా కాలక్షేపం చేస్తూ సోషల్ మీడియాలో తన అప్‌డేట్స్ షేర్ చేసుకుంటారు. తాజాగా హవెల్స్ యాడ్ షూటింగ్ చేశారు ప్రిన్స్ మహేష్ బాబు. అత్యధిక పారితోషకం అందుకునే నటులలో మహేష్ ముందు వరుసలో ఉంటారు.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, సూపర్ స్టార్ మహేష్ బాబు కొంతకాలం తరువాత స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే యాడ్ షూటింగ్ కోసం మహేష్ బాబు(Mahesh Babu), తమన్నా కలిసి నటించారు. ఇందుకు సంబంధించిన స్టిల్స్‌ను టాలీవుడ్ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు షేర్ చేసుకున్నారు. హవెల్స్ కమర్షియల్ షూటింగ్‌లో పాల్గొన్నారని ట్వీట్ చేశారు. మహేష్ బాబు న్యూ లుక్ వైరల్ అవుతోంది. సమ్మర్ సీజన్ మొదలు కావడంతో సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Chaavu Kaburu Challaga Release Date: చావు కబురు చల్లగా మూవీ రిలీజ్ డేట్ ప్రమోషన్లతో బస్తీ బాలరాజు కార్తికేయ బిజీబిజీ

కాగా, మరోవైపు సర్కారు వారి పాట కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పరశురామ్ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మహేష్ బాబు సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తొలిసారి జత కట్టింది. ఈ ఏడాది జనవరి చివర్లో దుబాయ్‌లో షూటింగ్ షెడ్యూల్ సైతం పూర్తిచేసుకున్నారు. అదే సమయంలో వరుస యాడ్ షూటింగ్‌లతో సూపర్ స్టార్ మహేష్ తీరిక లేకుండా గడుపుతున్నారు. 

Also Read: Android Smartphone: మీ మొబైల్ పోయిందా, దాన్ని కనుగొని Data Erase చేయడానికి ఇది చదవండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News