Mahesh-Rajamouli Movie Update: జక్కన్నతో మహేశ్ సినిమా కధ నేపధ్యమేంటి, ఎప్పుడు సెట్స్‌పై రానుంది

Mahesh-Rajamouli Movie Update: సూపర్‌స్టార్ మహేశ్ బాబు అభిమానులకు గుడ్‌న్యూస్. దర్శక ధీరుడు బాహుబలి ఫేమ్ దర్శకుడు రాజమౌళితో మహేశ్ సినిమా ఎప్పుడనేది క్లారిటీ వచ్చేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 10, 2022, 06:27 PM IST
  • రాజమౌళి - మహేశ్ బాబు సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్
  • రాజమౌళితో మహేశ్ బాబు సినిమా 2023లో ప్రారంభం
  • అడవి నేపధ్యంలో కధ సాగుతుందని లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్
 Mahesh-Rajamouli Movie Update: జక్కన్నతో మహేశ్ సినిమా కధ నేపధ్యమేంటి, ఎప్పుడు సెట్స్‌పై రానుంది

Mahesh-Rajamouli Movie Update: సూపర్‌స్టార్ మహేశ్ బాబు అభిమానులకు గుడ్‌న్యూస్. దర్శక ధీరుడు బాహుబలి ఫేమ్ దర్శకుడు రాజమౌళితో మహేశ్ సినిమా ఎప్పుడనేది క్లారిటీ వచ్చేసింది.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఎప్పట్నించో నిరీక్షిస్తున్న సర్కారు వారి పాట మే 12న అంటే మరో రెండ్రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే మ్యూజికల్‌గా హిట్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక త్వరలో మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా, రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో మరో సినిమా త్వరలో తెరకెక్కనున్నయనేది తెలిసిందే. 

దీనికి సంబంధించి అభిమానులు ఆనందించే అప్‌డేట్ వెలువడింది. స్వయంగా రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ అప్‌డేట్ ఇచ్చారు. రాజమౌళి-మహేశ్ బాబు సినిమా ఎప్పుడేనేది వివరించారు. జక్కన్న-మహేశ్ బాబు సినిమాపై ఓ జాతీయ మీడియాలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మహేశ్ బాబు-రాజమౌళి సినిమా వచ్చే యేడాది సెట్స్‌పై రానుందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందన్నారు. ఇంకా కధ పూర్తి కాలేదని చెప్పిన విజయేంద్ర ప్రసాద్..అడవి నేపధ్యంలో కధ ఉంటుందని మాత్రం క్లూ ఇచ్చారు. 

రాజమౌళి తెరకెక్కించనున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. అటు మహేశ్ బాబు కూడా రాజమౌళితో సినిమా విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నట్టు చెప్పాడు 

Also read: Kgf 2 Movie: కేజీఎఫ్2 మూవీ థియేటర్లో విషాదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News