VSR vs WV Collections: మూడో రోజూ 'వీర సింహా'ని చిత్తు చేసిన వీరయ్య.. ఇదెక్కడి మాస్ మావా?

  Veera Simha Reddy Vs Waltair Veerayya: సంక్రాంతి సందర్భంగా ఒక పక్కన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో మరో పక్క మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అయ్యాయి, మరి ఆ రెండు సినిమాల వసూళ్ల మీద ఒక లక్కు వేద్దామా?  

Last Updated : Jan 16, 2023, 03:06 PM IST
VSR vs WV Collections: మూడో రోజూ 'వీర సింహా'ని చిత్తు చేసిన వీరయ్య.. ఇదెక్కడి మాస్ మావా?

Veera Simha Reddy Collections Vs Waltair Veerayya Collections: సంక్రాంతి సందర్భంగా విడుదలైన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు మూడవరోజు ఎంత వసూలు చేశాయి అనే విషయం మీద ఒకసారి లుక్ వేద్దాం. వాల్తేరు వీరయ్య సినిమా కంటే నందమూరి బాలకృష్ణ సినిమా ఒకరోజు ముందుగానే విడుదలైంది. అయితే ముందుగా విడుదలైన ఈ సినిమా మొదటిరోజు పాతిక కోట్ల 35 లక్షలు వసూలు చేస్తే వాల్తేరు వీరయ్య ఒకరోజు తర్వాత విడుదలై 22 కోట్ల 90 లక్షలు వసూలు చేసింది.

ఇక రెండో రోజు వీర సింహారెడ్డి ఐదు కోట్ల 25 లక్షలు మాత్రమే వసూలు చేయగా వాల్తేరు వీరయ్య మాత్రం 11 కోట్ల 95 లక్షలు వసూలు చేసింది. మూడోరోజు వీర సింహారెడ్డి 6 కోట్ల 45 లక్షలు మాత్రమే వసూలు చేస్తే వాల్తేరు వీరయ్య మాత్రం 12 కోట్ల 61 లక్షలు వసూలు చేసింది. మొదటిరోజు వీర సింహారెడ్డి డామినేషన్ కనిపించగా తర్వాత రెండు రోజులు వాల్తేరు వీరయ్య డామినేషన్ కనిపిస్తోంది. ఇక మూడవ రోజు ఆంధ్రప్రదేశ్ -తెలంగాణలో కలిపి 6 కోట్ల 45 లక్షల షేర్, 10 కోట్ల 90 లక్షల గ్రాస్ వీర సింహారెడ్డి సినిమా వసూలు చేస్తే వాల్తేరు వీరయ్య మాత్రం 12 కోట్ల 60 లక్షల షేర్, 20 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లు అయింది.

ఇక మూడు రోజులకు వీర సింహారెడ్డి సినిమా 44 కోట్ల 50 లక్షలు షేర్ వసూలు చేస్తే 73 లక్షల 90 లక్షల గ్రాస్ వసూలు చేయగా వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే 58 కోట్ల 91 లక్షల షేర్ 101  కోట్ల 95 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఒకరకంగా బాలకృష్ణ సినిమా నాలుగు రోజుల్లో సంపాదించిన మొత్తం కంటే ఎక్కువ చిరంజీవి సినిమా మూడు రోజుల్లో ఎక్కువ సంపాదించినట్టు అయింది. ఈమేరకు బాలకృష్ణ సినిమా నాలుగు రోజులకు 104 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే చిరంజీవి సినిమా మూడు రోజులకు 108 కోట్ల గ్రాస్ సాధించింది. అలా ఈ సంక్రాంతి విన్నర్ చిరంజీవి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయం మీ ఉద్దేశం ఏంటో కూడా కామెంట్ చేయండి.

నోట్: ఈ వివరాలు వివిధ ఆన్ లైన్ వేదికల ద్వారా మేము సేకరించినవి, వీటిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు

Also Read: Veera Simha Reddy Day 4: మూడో రోజు కంటే పుంజుకున్న వీర సింహా రెడ్డి కలెక్షన్స్.. అది కలిసొచ్చిందే!

Also Read: Waltair Veerayya Day 3 Collections: 'వాల్తేరు వీరయ్య' మాస్ రెండో రోజు కంటే మూడో రోజే ఎక్కువ.. 100 కొట్టేసిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News